Wednesday, April 15, 2015

కొనసాగింపు..


అవును 
ఈ పాత పాళీ పెన్ను
సిరా ఇంకి పోయి రాయడం మాని
ఇలా చాన్నాళ్ళుగా ఒరిగిపోతూ వుంది!


ఈ పాత డైరీ అట్ట చెద తిని
అసంపూర్ణంగా రాయబడి
ఇలా చాన్నాళ్ళుగా చినిగిపోతూ వుంది!


నువ్వంటావు
ఎప్పుడూ ఆ పాత వాటి మధ్యలో
పెచ్చులూడిన గోడ వారగా వుంటావెందుకూ అని!


నేనంటానూ
ఈ పాత పెన్ను చెద రాలుతున్న డైరీ
ఈ పెచ్చులూడుతున్న గోడ నన్నిలా నిలబెట్టే
నా అసంపూర్ణ కొనసాగింపు అని!!

1 comment:

  1. నువ్వంటావు
    ఎప్పుడూ ఆ పాత వాటి మధ్యలో
    పెచ్చులూడిన గోడ వారగా వుంటావెందుకూ అని!
    అక్కడే కదా ! శిథిల వ్యధల చిత్రాల రహస్యాలు దొరికేది

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...