గాలికి కాసింత రంగునద్దుదామని
ఇన్ని గోరింటాకులు ఏరి తెచ్చా
కానీ గాలి ఆ కొండ మలుపుని దాటగానే
ఓ పావురం నెత్తురంటి ఎర్రగా కుంగిపోయింది!
పాటకింత పరిమళాన్ని జతచేద్దామని
ఇన్ని మల్లెలు గుది గుచ్చి తెచ్చా
కానీ పాట ఆ అడివంచు చేరగానే
గొంతు తెగిన కోయిలొకటి కూలిపోయింది!
ఒక దు:ఖపు చినుకు రాలి
నేల తల్లికి గర్భస్రావం అయింది!!
మంచి కవిత
ReplyDeleteబాగుంది కవిత
ReplyDeleteఒక దు:ఖపు చినుకు రాలి
ReplyDeleteనేల తల్లికి గర్భస్రావం అయింది
ఇలాంటి ప్రత్యేకమైన మాటలతో మనసుని మెలిపెడతారు. అందుకే మీరు KKK
కవితలు బాగుంటాయి.
ReplyDeleteబాగుంది..బాగుంది
ReplyDelete