కొన్ని నెత్తురింకిన సమయాలు దోసిళ్ళలో ఇమడవు
కొన్ని ఇసుక గూళ్ళుగా మారి కూలిపోతాయి
కొన్ని రాతి పొరలలో దాగి పొక్కిలిగా కరుగుతూ చారికలవుతాయి
కొన్ని మైనపు పొరలలో దాగి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి
కొన్ని చీకటి అరలలో వెలుగును కప్పుకుంటాయి
కొన్ని భూమి పొరలలో లావాలా ఉడుకుతుంటాయి
కొన్ని రాజేయబడని అగ్ని శిఖలా పొగలూరుతాయి
కొన్ని రాజీపడలేని ముళ్ళుగా మారి నిత్యమూ హెచ్చరికలవుతాయి
కొ
న్ని
స
మ
యా
లు
న్ని
స
మ
యా
లు
వెంటాడే రంపపు కోతలా ఎదురవుతూనే వుంటాయి....
కొన్ని సమయాలు జీవితం లో వచ్చుండ కపోతే బాగుండని పిస్తాయి
ReplyDeleteనిజమే తనూజ గారూ.. థాంక్యూ
Deleteకొన్ని సమయాలు కావాలన్నా మళ్ళీ రావు.
ReplyDeletenijame kadaa.. thank you Srujana gaaru..
ReplyDelete