ఏదో ఒక చివురున వేలాడే ఒక్కో చినుకును దీపపు మాలగా చేసి
ఈ రాతిరి నీ మెడలో హారంగా వేయాలని
అక్కడక్కడా కొన్ని పూరెమ్మలను అతికించి
కాసింత పరిమళాన్ని అద్దాలని
ఈ ఐ మూల ఈ నూనె వత్తిని కాసింత పైకి లాగి
ఆరి పోకుండా అడ్డుపెట్టిన అరచేతులగుండా వెలిగే ఖాళీని
కాసింత పొదివి పట్టుకొని
నీముందు కురవనీ
చినుకును దీపపు మాలగా చేసి
ReplyDeleteఈ రాతిరి నీ మెడలో హారంగా వేయాలని
..Good Expression Sir..
Thank you నవజీవన్ గారు..
Deleteఈ రాతిరి నీ మెడలో హారంగా వేయాలని...మరి మాకు వెన్నెల కరువేనా :-)
ReplyDeleteనీ అల్లరి స్పందనకు ఆత్మీయాలింగనం అనికేత్.. థాంక్యూ..:-)
ReplyDeleteఅన్నీ అనుకోవడమేనాండి
ReplyDeleteanukokundaa analem kadandee..:-)
Delete