Tuesday, November 4, 2014

నిరామయం



నీకంటూ ఓ ఆకాశం వేలాడుతూనే వుంది


కానీ నేనింకా ఈ గరకు నేలపైనే కదలాడుతున్నా

నాదంటూ ఇక్కడ ఏమీ మిగలక 

ఎండిన రావి ఆకు ఈనెలపై ఒక్క మాట రాసి

ఈ నేల తడి మడతలో దాచి 

వీడిన పూరేకును అలంకరించి

ఈ రాతి పగుళ్ళ మధ్య

కళ్ళనిలా వేలాడదీసా!

5 comments:

  1. మీరు రాసిన పదాల్లో లోతట్టుభావం కనుగొనడం కష్టమేనండి :-)

    ReplyDelete
    Replies
    1. panditulu rasajnulu meere alaa ante yelaa Sandhya Sri gaaru..:-)

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...