Saturday, November 8, 2014

ఇసుక వర్ణ చిత్రం..



ఈ కాలుతున్న వెన్నెల వేళ 

చిలకరించిన కాసింత చీకటి రేఖల మధ్య

దొంగిలించిన నవ్వునద్దుకొని 

గులక రాళ్ల పగుళ్ళ జాడలలో

ఓ అసంపూర్ణ ఇసుక వర్ణ చిత్రాన్ని అద్దుతూ

పగిలిన కలల అద్దంలో

గాయం ముఖాలుగా విడిపోతూ

నెత్తుటి దోసిలిలో

ఒలికిపోతూ!!

2 comments:

  1. మొత్తానికి వెన్నెలనే కాల్చేసారు :-) బాగుందండి.

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...