Friday, October 10, 2014

నివేదన..


శూన్యాన్ని ఒకింత ఒడిసిపట్టుకొని
మౌనాన్ని కాసింత ఆలపించనీ

ఈ వెదురు ఆకుల సవ్వడిని 
మోదుగు పూల రంగుని 
కొండ పాదాన్ని తాకే మబ్బు తునకని
ఒకింత దాచుకొని
మరికొద్ది కాలం
చరించనీ
ఈ 
పచ్చిక 
మొలకలపై

..............

4 comments:

  1. మీ కవిత చాల చాల బావుంది ,మీరేమి అనుకోక పొతే నాకిలా అనిపించింది .
    [ఈ పచ్చిక మొలకల ఫై ఒక గ్యాపకం గా సంచరించనీ ]

    ReplyDelete
    Replies
    1. బాగుందండీ నేనెమనుకోను..థాంక్యూ తనూజ గారు..

      Delete
  2. ఈ వెదురు ఆకుల సవ్వడిని
    మోదుగు పూల రంగుని
    కొండ పాదాన్ని తాకే మబ్బు తునకని
    ఒకింత దాచుకొని...ఈ అందమైన పదాల పొందిక మీదే

    ReplyDelete
  3. మీకు నచ్చినందుకు థాంక్యూ పద్మార్పిత గారు..

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...