Saturday, May 3, 2014

తడి అంటిన పూలు...


కొన్ని వాక్యాలకు ఫుల్ స్టాపులుండవు
కొన్ని పరిచయాలకు ముగింపులుండవు


కొన్ని గాయాలు చికిత్సకందవు
కొన్ని కరచాలనాలు మరపురావు


కొన్ని మాటలకు శబ్దముండదు
కొన్ని పాటలు గొంతు దాటి రావు


కొన్ని క్షణాలు ఊపిరినిస్తాయి
కొన్ని సమయాలు పరిమళిస్తాయి


కొన్ని జీవితాలు దుఖాంతమవుతాయి
చివరిగా తడి అంటిన పూలు సమాధిని తాకుతాయి

8 comments:

  1. కొన్నంతే.... అక్షరాలలో ఒదిగిపోతాయి. గుండెనుండి పొదిగి వస్తాయి.

    ReplyDelete
  2. పూలు వాడిపోకూడదని తడి అంటీ అంటనట్లుగా అంటితే పర్వాలేదు కానీ తడిసి ముద్దైతే కుళ్ళిపోతాయేమో కదండి.:-)

    ReplyDelete
    Replies
    1. తడిసి ముద్దైనా కుళ్ళినా అవి చేరేది వాసన పోని సమాధి పైనే కదండీ.. :(
      ధన్యవాదాలు పద్మార్పిత గారు..

      Delete
  3. వర్మ గారూ !
    మీ 'తడి అంటిన పూలు' మనసులో కొంత భారాన్ని నిపింది.

    "కొన్ని వాక్యాలకు ఫుల్ స్టాపులుండవు
    కొన్ని పరిచయాలకు ముగింపులుండవు"

    జీవిత సారాన్ని నింపారు మీ మాటల్లో .
    మీ రచనలు ప్రత్యేకంగా, పటుత్వంగాను
    తోస్తాయి .

    బాగుందండీ మీ కవిత,
    *శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు శ్రీపాద సార్..

      Delete
  4. హృదయాన్ని హత్తుకునే కవిత

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు సాంధ్య శ్రీ గారు..

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...