తడి అంటిన పూలు...
కొన్ని వాక్యాలకు ఫుల్ స్టాపులుండవు 
 కొన్ని పరిచయాలకు ముగింపులుండవు
 కొన్ని గాయాలు చికిత్సకందవు
 కొన్ని కరచాలనాలు మరపురావు
 కొన్ని మాటలకు శబ్దముండదు
 కొన్ని పాటలు గొంతు దాటి రావు
 కొన్ని క్షణాలు ఊపిరినిస్తాయి
 కొన్ని సమయాలు పరిమళిస్తాయి
 కొన్ని జీవితాలు దుఖాంతమవుతాయి
 చివరిగా తడి అంటిన పూలు సమాధిని తాకుతాయి 
 
 
 
 
          
      
 
  
 
 
 
 
 
 
 
 
 
 
కొన్నంతే.... అక్షరాలలో ఒదిగిపోతాయి. గుండెనుండి పొదిగి వస్తాయి.
ReplyDeleteThank you Fathimaji..
ReplyDeleteపూలు వాడిపోకూడదని తడి అంటీ అంటనట్లుగా అంటితే పర్వాలేదు కానీ తడిసి ముద్దైతే కుళ్ళిపోతాయేమో కదండి.:-)
ReplyDeleteతడిసి ముద్దైనా కుళ్ళినా అవి చేరేది వాసన పోని సమాధి పైనే కదండీ.. :(
Deleteధన్యవాదాలు పద్మార్పిత గారు..
వర్మ గారూ !
ReplyDeleteమీ 'తడి అంటిన పూలు' మనసులో కొంత భారాన్ని నిపింది.
"కొన్ని వాక్యాలకు ఫుల్ స్టాపులుండవు
కొన్ని పరిచయాలకు ముగింపులుండవు"
జీవిత సారాన్ని నింపారు మీ మాటల్లో .
మీ రచనలు ప్రత్యేకంగా, పటుత్వంగాను
తోస్తాయి .
బాగుందండీ మీ కవిత,
*శ్రీపాద
ధన్యవాదాలు శ్రీపాద సార్..
Deleteహృదయాన్ని హత్తుకునే కవిత
ReplyDeleteధన్యవాదాలు సాంధ్య శ్రీ గారు..
Delete