Friday, May 24, 2013

ఎండ కాలం...


రోడ్డు మీద కాలుతున్న రాతి వాసనతో
మనసు కూడా…


మౌనంగా ఆకుల తేమను హరిస్తూ
గొంతు పెగలనితనం…


ఆరిపోతున్న చెలమలోని తడి
దేహమంతా భారమౌతూ…


దోసిలిలో నిప్పుల కుంపటితో
గుండె మండుతూ…


కన్నులలో ఇగిరిపోతున్న నీటి పాయ
రెప్పలముందు వడగాడ్పు…


కలలన్నీ ధూళి కమ్ముకుంటు
చినిగిన తెర పైకి లేస్తూ…

4 comments:

  1. వర్మగారు ఈ వేడిని తాళడం కష్టమేనండి....అద్భుతంగా రాసారు.

    ReplyDelete
  2. మీ అభిమానానికి ధన్యవాదాలు అనికేత్ గారూ..:-)

    ReplyDelete
  3. మండువేసవిలో మంచుముత్యాల మాల మీ కవిత

    ReplyDelete
    Replies
    1. మీ మాటెప్పుడూ ఉత్ప్రేరకమే ప్రేరణ గారు.. ధన్యవాదాలు.

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...