Wednesday, May 15, 2013

రంగద్దని చిత్రం...



కనులముందు పరచుకున్న కాన్వాసుపై
ఇన్ని రంగులు అద్దుతూ...

కొంచెం చీకటిని వెలుగును నలుపు తెలుపుల
మద్య పొదుగుతూ...

రాత్రి మిణుగురుల కాంతిని ఒక్కో గీత
అంచుల నింపుతూ...

అసంపూర్ణత్వమేదో కుంచె చివర
వర్ణాల వెనకాల విరిగిపోతూ...

విసురుగా వీస్తున్న గాలి కెరటాల వేగానికి
ఆకు అంచులా చినిగిపోతూ...

నెలవంక వెనకాల పరుగులెడుతున్న
కుందేలు కాలి ముద్రలు అతుకుతూ...

చెవిలో వినిపించీ మనసులో ఇంకని
స్వరమేదో రొదపెడుతూ...

గాయం నుండి స్రవిస్తున్న నెత్తురు
కాగితపు చివరల ఒలికిపోతూ...

మనసంత శూన్యపు ఆవిర్లు కమ్ముకుంటూ
కాలుతున్న ఒంటరితనం మండుతూ...

చేతులు బార్లా చాపి కావలించుకున్న
ఖాళీతనాన్ని కాన్వాసుపై చిత్రిస్తూ...

8 comments:

  1. భావాలని పొందుపరుస్తూ అందమైన అక్షర చిత్రాన్ని గీసి.....ఖాళీతనం అంటారేంటో కవిగారు :-)

    ReplyDelete
    Replies
    1. ఆ అక్షర చిత్రం వెనక వున్న ఖాళీతనం చెప్దామనే పద్మార్పిత గారు.. మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలండీ..

      Delete
  2. మౌనంగా చదివి, మళ్ళీ మళ్ళీ చదువుకోవడానికి దాచుకోవడం...మాటలు కుదరడంలేదు. అన్నిటినీ పుస్తకంగా ప్రచురించకూడదూ?

    ReplyDelete
    Replies
    1. మొన్నటి డిసెంబరు వరకు రాసిన కవితలు రెప్పల వంతెన పేరుతో కవితా సంపుటి వేసానండీ.. మీ చిరునామా మైయిల్ చేయండి. పంపిస్తాను. మీ అభిమాన స్పందనకు ధన్యవాదాలు అనూ గారూ..

      Delete
  3. బాగుందండి,..అసంపూర్తిగా వదలకుంటే ఇంకా బావుండేదేమో అనిపించింది,.

    ReplyDelete
    Replies
    1. అలా అసంపూర్ణత్వమ్ వెంటాడుతోంది భాస్కర్జీ..:-) thank you sir..

      Delete
  4. ఒంటరితనం ఎప్పుడూ విషాదమే అందుకే ఖాళీగా ఉంచకండి మనసుని భావాన్నికూడా

    ReplyDelete
    Replies
    1. అలాగే రాంజీ.. అయినా అది మన చేతుల్లో వుండదు కదా.. తర్కానికి దొరకనిది కదా.. :-) thank you sir..

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...