Monday, January 14, 2013

రెప్పల వంతెన గూర్చి 'వాకిలి' పత్రికలో..


మూడేళ్లుగా ఎదురుచూస్తున్న కెక్యూబ్ వర్మ కవిత్వం మొత్తానికి ఇప్పుడు పుస్తక రూపం దాల్చింది. ఎప్పటినించో రాస్తున్న కవే అయినా, ఈ మూడేళ్లలో వర్మ తనదయిన గొంతు విప్పి, తన కవిత్వ వాక్యాల కింద వర్మ అని సంతకం అక్కర్లేకుండానే ‘ఇది వర్మ రాసిన వాక్యం’ అనే గుర్తింపు సాధించుకున్నాడు. వర్మ కవిత్వం చదువుతున్నప్పుడు వొక ఫైజ్ అహ్మద్ ఫైజ్ గుర్తొస్తాడు. వొక దార్విష్ గుర్తొస్తాడు. వొక నెరూడా మన మధ్యలోంచి నడిచి వెళ్తున్నాడనిపిస్తుంది. సున్నితమయిన ప్రేమనీ, కర్కశమయిన యుద్ధాన్ని రెండీటినీ గానం చేస్తున్న కవి వర్మ. అతని కవిత్వ సంపుటి ‘రెప్పల వంతెన’ కవిత్వ ప్రేమికులకు వొక ఈవెంట్! ఈ పుస్తకం కబుర్లు ఇవిగో!....

నా కవితా సంకలనం 'రెప్పల వంతెన' గురించి వెబ్ మేగజైన్ 'వాకిలి' లో ....

12 comments:

  1. నెరుడా ప్రభావం ఉందా మీ మీద.''రెప్పల వంతెన''all the best.curious to read.

    ReplyDelete
    Replies
    1. నేను నెరూడాను చదవలేదు శశి కళ గారూ.. నాకంతగా ఆంగ్ల భాషపై పట్టులేదు.

      మీ చిరునామా ఇస్తే నా పుస్తకం పంపుతా... చదివి మీ అభిప్రాయం చెలియజేయండి..

      Delete
  2. Replies
    1. అభినందనలు వర్మగారూ! మీ పుస్తకం ఎక్కడదొరకుతుందో తెలపండి.? భావుకత నిండిన భావకవిత్వం మీది. నాకు కృష్ణశాస్త్రి గురుతుకోస్తారు.ఎందుకంటే మీ కవితలలో ఎక్కడో అంతర్లీనంగా వేదన కనిపిస్తుంది.

      Delete
    2. ధన్యవాదాలు పూర్వ ఫల్గుణి గారు.. ప్రస్తుతానికి నా వద్దే వున్నాయి. హైదరాబాదు దిశ పుస్తక కేంద్రంలో కొన్ని వున్నాయి. యింకా పూర్తిగా పుస్తక విక్రయకేంద్రాలకు చేర్చలేదు. తప్పక తెలియచేస్తాను మీకు. లేదంటే నా మైల్ ఐడి కి చిరునామా ఇవ్వండి..

      Delete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. నేను చదవనేలేదు:-( మార్కెట్లోకి విడుదలయ్యిందా? అభినందనలు!

    ReplyDelete
    Replies
    1. మార్కెట్లోకి ఇంకా కాలెదు మేడం.. మీ చిరునామా ఇవ్వండి పంపిస్తా...:-)

      Delete
  5. హృదయపూర్వక అభినందనలండి

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...