Sunday, January 20, 2013

కురవనీ...

 కురవనీ
ఈ దినమంతా నాపై దుఃఖపు వాన...

నీముందు మోకరిల్లినా కరగని
ఈ మంచు గడ్డ ఎదపై ఇలా కరిగి కురవనీ....

కురవనీ
కాలమంతా కరిగి ఓ అగ్ని పూల వానగా...

భగ భగ మండే ఎద తటాకంలో
కురిసీ నన్ను దహించనీ....

మనిషిగా మిగిల్చే నీ అమృతపు వాక్కు లేక
ఈ ఎడారి దారిలో దాహార్తితో మిగలనీ చివరి క్షణాలు....

నీ కంటి కొన జారిన నీటి బిందువే
నా గొంతున విషాద ధారగా కురవనీ...

బాధా తప్త నిప్పు కణికలు మరల మరల మండి
నీ చేతిలో బూడిదనై చెరిగిపోనీ....

నేనొక్కడిగా మిగల లేని అణువునై ఈ కాటి నేలపై
జ్వలించి దహించిపోయే ఆమ్లపాతం కురవనీ....

12 comments:

  1. నీ కంటి కొన జారిన నీటి బిందువే
    నా గొంతున విషాద ధారగా కురవనీ...
    నాకు చాలా చాలా నచ్చిందండి.

    ReplyDelete
    Replies
    1. చాలా రోజులకి మీ వ్యాఖ్య పొందడం ఆనందంగా వుంది సృజన గారు.. ధన్యవాదాలండీ...

      Delete
  2. అత్యంత అద్భుతం అంటే.......ఈ విషాదకవితలని ఇలాగే సాగిస్తారని:-)

    ReplyDelete
    Replies
    1. గుండె పలికేది విషాదమో విలాపమో ఇలా మీతో పంచుకుందామని...చెప్పకనే చెప్పారు కదా...:-) thank you Padmarpita garu..

      Delete
  3. కుమారవర్మగారు.....కూసింత అప్పుడప్పుడు మీరు నవ్వుతూ మమ్మల్ని నవ్వించవచ్చుకదా:)

    ReplyDelete
    Replies
    1. ప్రయత్నిస్తా తెలుగమ్మాయి గారు... :-)thank you..

      Delete
  4. అబ్బురపరిచే పదజాలం మీ ప్రతిపంక్తిలోను

    ReplyDelete
    Replies
    1. మీ స్ఫూర్తిదాయక స్పందనకు ధన్యవాదాలు Tharkam sir..

      Delete
  5. నిరాశ నీలిమబ్బులు కమ్మిన నా ఎదపై
    నీ అలకల సెగ కురిసి కురిసి వెలియనీ

    అల్లుకున్న మన చెలిమి బంధం అలవోకగా
    ఆనందమై నా జీవిత యానంలో మురియనీ


    ***ఏంటో విషాదం సైతం అక్షరాలై మీ కలమ్ నుండి జాలువారి మాకూ కవితాస్ఫూర్తినలదుతాయి...కవివర్మాజీ మీ భావుకతకు సలామ్....

    ReplyDelete
    Replies
    1. పద్మా శ్రీరాం గారూ మీ కవితాత్మీయ స్పందనకు ధన్యోస్మి...

      Delete
  6. మీరు గురువై నాతో ఇలాంటిది ఒక్కటైనా రాయించండి వర్మగారు:)

    ReplyDelete
    Replies
    1. గురువు స్థానంలో కూచునే అర్హత నాకు లేదు అనికేత్... ఫ్రెండ్ గా కలిసి జుగల్బందీ ఆలపిద్దాం...:-)
      మీ అభిమానానికి ధన్యవాదాలు...

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...