ఋజువంటూ ఏం చూపగలను
నువ్వలా విసిరి కొడితే ఉబకని కన్నీటి సింధువుతప్ప..
ఒరిపిడికి గురయిన ఎద రక్త చారికలను
జేబు వెనకాల దాచలేని నిస్సహాయత...
పిలిచినా పలకని వేళ నా మది కుంగిన తీరు
ఆ కురవని మబ్బును తాకి చూడు ఒలికిపోతుంది నీ అరచేతిలో....
గాలి చుట్టూ పరచుకున్న నీ పరిమళం ఉక్కిరిబిక్కిరి చేస్తూ
నా చుట్టూ ఓ అగ్ని వలయాన్ని సృష్టిస్తూ
దహిస్తూ దాహమేస్తుంది ప్రియా...
నువు నవ్వని ఈ రాత్రి కునుకు రాని రెప్పల చివర కురుస్తున్న ధార
నీ ఎద చెంత చేరి నిను మేల్కొలపదా సఖీ...
కరిగిపోనీకు ఈ రేయి వెన్నెలను
నీ మౌన శిల్పంగా....

హ్మ్...బాధను అక్షరాల్లోకి చక్కగా మలచారు
ReplyDeleteThank you శశి కళ గారు...
Deleteగారంగా అలిగి ఋజువడిగి ఉంటుందండి
ReplyDeleteదానికి ఇంతలా స్పందించాలా వర్మగారు:)
గారంగా అలిగినా తట్టుకోలేని హృదయం ఇలానే స్పందిస్తుంది కదా ప్రేరణ గారు..:-) thank u
ReplyDeleteవర్మగారి స్టైల్లో వ్యధాభరితంగా ఉంది:(
ReplyDelete