Wednesday, January 16, 2013

నిర్దయ ఏల??


నువ్వెప్పుడూ అలలా ఎగసి
ఎద తీరాన్ని తాకి అంతలోనే
మాయమౌతావు...

అక్కడక్కడా పూసుకున్న
పాల నురుగు వెచ్చదనం
నన్నిలా బతికిస్తూంది...

నీ చూపుల మెరుపు తాకిడి
మనసు మూలల దాగిన
నాలోలోపలి జ్వాలను రగిలించె...

నీ పెదవి చివరంటిన తడి
యుగాల దాహార్తిని
తీర్చే ఒయాసిస్సు కాదా...

తాకీ తాకేంతలోనే
ఓ గాలి తిమ్మెరలా
హృదయాన్ని మేల్కొలిపి
కనురెప్ప తెరచేంతలోనే
మరలిపోతావు...

ఇంత నిర్దయ ఏల??
ఈ మంచు దుప్పటి
ముసుగు కరగనీయవా
ప్రి


ఖీ...

4 comments:

  1. ఇంత సౌమ్యంగా చెప్పడం మీకే చెల్లు. చాన్నాళ్ళకి రాసారు.

    ReplyDelete
    Replies
    1. ఈ మధ్య బుక్ పనిలో పడి కాస్తా దూరమయా బ్లాగుకి.. మీ అభిమాన స్పందనకు ధన్యవాదాలు Yohanthji...

      Delete
  2. అదేంటో అంతలా మీ ఎదను తాకినామెని నిర్దయ అంటూ నిందారోపణ?:-)Nice feeling

    ReplyDelete
    Replies
    1. అప్పుడప్పుడూ తన అలక ఇలా మారి భారమయి...:-)
      థాంక్యూ పద్మార్పిత గారు...

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...