Friday, January 18, 2013

సుస్వాగతం...

నా మది తలపుల తలుపు తెరచి
స్వాగతిస్తున్నా...

కనురెప్పల వాకిలిలో
ముద్ద మందారమై విరబూయవా...

మంచు తెరలు కరిగి మల్లెల పరిమళమై
సన్నని విరజాజి తీగలా అల్లుకుపోవా...

నీ నడుము వంపున పారే
సెలయేరునై కరిగిపోనా,,,,

సఖీ
చెలీ
ప్రియా

నీ అలకల ఎర్ర గులాబీ రేకుపై
నా ఎద ఊసుల లేఖ రాయనా...

కను గీటున నీ మెడ వంపున చేరి
మరుజన్మ లేని వరమీయవా...


6 comments:

 1. "నీ అలకల ఎర్ర గులాబీ రేకుపై
  నా ఎద ఊసుల లేఖ రాయనా..."
  ఇంతందంగా రాస్తానంటే ఎప్పటికీ అలిగే ఉంటుండేమో.....జాగ్రత్తండి:-)

  ReplyDelete
  Replies
  1. అలిగి ఆ వరమిస్తానంటే అలకా మంచిదే కదా పద్మార్పిత గారూ...

   Delete
 2. మీ కవితల్లో వేదన, వేడుకోలు కూడా చక్కగా పండిస్తారు.

  ReplyDelete
 3. మీరు ఇలా బ్రతిమిలాడితే అలాగే నెత్తికెక్కుతారేమో:)

  ReplyDelete
  Replies
  1. అంతేనంటావా అనికేత్.. అయినా తప్పదు కదా...:-)

   Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...