నాన్నా నేనూ ఓ రాత్రి
కతలు నెమరువేసుకునే వేళ
కలలు కుప్పబోసుకుని ఏరుకునే వేళ
మీరు నేను
కూచున్న ఆ కొబ్బరాకుల చివుళ్ళ లేలేత
వెన్నెల చారలు కప్పుకున్న రాత్రి
మీ ఒడిలో తలపెట్టి నేను
నా తలలో మీ వేళ్ళు ఆప్యాయంగా నిమురుతుండగా
మీ కత వింటూ ఉంటే
ఆ రోజు అలెగ్జాండర్, నెపోలియన్ చిన్నబోయారనిపించింది...
జీవితపు సుడిగుండాలను దాటుకొని
సంసార సాగరాన్ని ఈదిన మీ బాహువుల బలం
వరమివ్వమని వేడుకుంటున్నా...
ఎందుకో మీరంటే భయం వేసేది చిన్నప్పుడు
కానీ పెరుగుతున్న తనంలో దాని వెనక
దాగిన మీ ప్రేమ అవగతమై
మీ కళ్ళలో ఎరుపు జీరల వెనక దాగిన
కన్నీటి పొర ఇప్పుడు సుస్పష్టంగా గోచరమై
నా కళ్ళనిండుగా కన్నీటి సుడులు....
ఏటికెదురీదడం
తలవంచక బతకడమే నేర్పిన
మీ బాట ఎప్పటికీ శిరోధార్యం.....
chaala chaala bagundandi, kaani meeru enchukunna font bagaa ledu. font bagunte thondaragaa chadavochchu.nemmadiga choosi chadivete interest kalagademo ani naa abhipraayam.emantaaru?
ReplyDelete@Sameera మీ ఆత్మీయ సూచనకు ధన్యవాదాలండీ...ఫాంట్స్ మార్చాను...థాంక్యూ...
ReplyDeletechaala baa raaseru kumar garu
ReplyDeletemy dad is my hero..
chadivithey meeku kuda mee nanna gare hero ani anipinchindi
:)
@వంశీ గారు..నిజమేనండీ..నాకు మా నాన్నగారే హీరో..గురువు, దైవం...మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు...
ReplyDeleteబాగరాసారండి .
ReplyDeletehappy fathers day .
@మాలాకుమార్ గారు థాంక్సండీ...Happy father's day Sir..
ReplyDeletejeevitapusudigundaalni daati...sansarasagaranni...
ReplyDeletechalabagundi..meekavita..
@anangi balasiddaiahః ధన్యవాదాలు సార్..
ReplyDeletechala bagundi kumar garu.tandri mida kavita adi chala manchi vishayam .mee katha vintu untey algjander neopoliyan chinna boyinatlu anipistundi.correct ga cheypparu sir
ReplyDeletenarra venu gopal గారు మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలండి...
ReplyDelete