తొలకరి వేళ...

తొలివేకువ కిరణంలోని మెరుపును నేనే
తొలి మొగ్గ తొడిమను నేనే
తొలి పుష్పం రేకులోని మృధుత్వాన్ని నేనే
తొలకరి చినుకులోని చల్లదనాన్ని నేనే
తొలి చినుకు పడిన మట్టి పరిమళాన్ని నేనే
తొలి సాగుబడిలోని సాలును నేనే
తొలి విచ్చుకున్న విత్తన మొలకను నేనే
తొలి సారి విరగ కాచిన వరి వెన్నును నేనే
తొలిసారిగా ఆకుపచ్చ చందమామ మోముపై విరిసిన చిరునగవును నేనే...
:) చాలా బాగుంది....ఎంత బాగా రాశారు? ప్రతి లైన్...తొలి తో మొదలుపెట్టి....నేనే తో ముగించీ :) ముచ్చటగా ఉంది
ReplyDeleteధన్యవాదాలు ఇందు గారు..
ReplyDelete