Wednesday, June 15, 2011

వెన్నెల ఖడ్గం..పున్నమి వెన్నెల చుట్టూ
కమ్ముకుంటున్న నల్లని మబ్బుల చాటున
మాసిపోయిన చందమామ
ఈ రేయి అమవాస కానీయకు...

గుండెలలో నింపుకున్న ప్రేమ
వెండి వెన్నెలలా తన కళ్ళలో చూడాలన్న
ఆతురతను కాల మేఘం చాటుకు పోనీయకు...

రా... ఈ రాహువును సంహరించి
తిమిరాన్ని జయించి
వెన్నెల ఖడ్గాన్ని బహూకరిద్దాం...

3 comments:

  1. వావ్ సూపర్బ్!! బాగుంది మీ వెన్నెలఖడ్గం!

    ReplyDelete
  2. @ఇందుః ధన్యవాదాలండీ...

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...