Thursday, June 2, 2011

కాసింత చోటును వదలండి...



కాసింత చోటును వదలండి...

మాకింక కాలు మోపడానికి

ఇంత జాగా

మిగలనివ్వండి...

మూడు ఇటికలు పేర్చుకొని

ఇంత బువ్వ వండుకొనే

చోటు కూడా మిగలకపోతే ఎలా?

నెత్తిన చుట్టిన తుండు గుడ్డ

తీసి తలకింద వుంచుకొని

మోచేయిపై ఆన్చి చిన్న

కునుకు తీసే స్థలమైనా లేకపోతే ఎలా?

చుట్టూ కంచెవేసుకుంటూ

పోతుంటే చివరకు

కాటికి కూడా మిగలక

మీ గుండెలపై కాల్చాల్సి వస్తుంది...

2 comments:

  1. నెత్తిన చుట్టిన తుండు గుడ్డ

    తీసి తలకింద వుంచుకొని

    మోచేయిపై ఆన్చి చిన్న

    కునుకు తీసే స్థలమైనా లేకపోతే ఎలా?superb...mee kavita...manadesa paristitulanu..chakkaga addam padutundi...keep writing

    ReplyDelete
  2. మీ గుండెలపై కాల్చాల్సి వస్తుంది... choostunnara veellu...vintunnara...vaallu..??

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...