Monday, June 27, 2011

కిటికీ..



కిటికీ పక్కన కూచొని ఎన్నాళ్ళయిందో...


అలా తెరిచిన కిటికీ ఓ బుల్లితెరలా
మారి ఎన్నెన్ని దృశ్యాలతో నిండుకుంటూ
ఖాళీ అవుతూ ఓ ఆబ్ స్ట్రాక్ట్ పెయింట్ లా
గజిబిజిగా మారి మస్తిష్కంలో
అటు యిటూ తెలియని రంగుల పూతలా...

ఎక్కడో మాసిన నూనె గుడ్డ కాలిన వాసన...
మబ్బు కమ్మిన సగం కోసిన వెన్నెల క్రీనీడ
ఊచలలోంచి వచ్చి చినిగిన చేతి సంచిపై పడుతోంది...

అట్ట వూడిన పుస్తకం అంచులు
కొరుకుతూన్న పురుగు రెక్కలొచ్చి
పక్కకు ఒరిగి పోయింది....

కాలిన సిగరెట్టు వేలి చివర చురుక్కు మంటూ
కాగితంపై పడ్డ నుసి నల్లని మరకను పూసింది...

చివరి సిరా చుక్క రాయనంటూ
కాగితం అంచున ఒలికిపోయింది...

6 comments:

  1. maatalu ravadam ledu. kavitvam ante meeru rasedenemo!!! bhaavam ante meeru olikinchedenemo!!! wonderful.

    ReplyDelete
  2. @curve(Vijayabhanu Mam): మీకు నా లైన్స్ నచ్చినందుకు థాంక్సండీ...కవిత్వంలో ఓనమాలు దిద్దుతున్న వాడిని...

    ReplyDelete
  3. "సగం కోసిన వెన్నెల క్రీనీడ"

    "చివరి సిరా చుక్క రాయనంటూ
    కాగితం అంచున ఒలికిపోయింది"

    These two are very good images.
    congrats for getting award as well.

    ReplyDelete
  4. @sunamu:ధన్యవాదాలు సార్...

    @వనజ వనమాలి ఃధన్యవాదాలు వనజ గారు..

    ReplyDelete
  5. chivari siraa chukka raayanantu kaagitham anchuna olikipoindi...... chaala bavundi sir.

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...