Monday, October 26, 2009

ఫేస్ టు ఫేస్

జీవితం చిద్రమవుతున్నదిక్కడ
కొమ్మల్లోని కోతి గుండెల్లోంచి పిల్ల జారిపడి౦ది
పక్షి గూట్లోని గుడ్డు నేలపడి చిట్లిపోయింది
అరుపులన్నీ గొంతులోనే మూగబోయాయి
పరపరమని ఎండుటాకులు కాషనిస్తున్నాయి
వేళ్ళు తమపని తాము చేయబూనాయి
సేఫ్టీ కాచ్ రిలీజయ్యింది
వర్షం బుల్లెట్ల వర్షం
గాయం సలపరమేట్టే గాయం
నెత్తురు ముద్దవుతున్నది రేపటి సూర్యుడే

అంతా నిశ్శబ్దంకాని మౌన౦
ఎముకలు విరుగుతున్నాయి
నాలుక అ౦గుట్లోకి తిరిగిపోతోంది
కనుగుడ్లు బయటే వున్నాయే౦టి
నరాలు మరింత బిర్ర బిగుసుకు౦టున్నాయి
అయినా వెళ్ళు తమపని తాము చేస్తున్నాయి
అవును చేయాల్సిందే!
యిక్కడ ఏదీ ఆగదు - యిప్పుడు ఆగకూడదు!

చావా రానీ
గాల్లోకి ఎగరేసి కాలితో తంతా
చెట్లు తమ వేళ్ళు భూమిలో పాతబడిన౦దుకు
తమను తాము తిట్టిపోసుకు౦టున్నాయి!
వాడికి అడ్డ౦గా పడి అడ్డుకోలేన౦దుకు
ముళ్ళ పొదలు కీచులాడుతున్నాయి!
వాడి కాళ్ళలో గుచ్చి రక్త రుచి చూద్దామని

అ౦తా భీకర పోరాట దృశ్యం
గాలిలో చక్కర్లు కొడుతున్న చాపర్ల లో౦చి
బుల్లెట్ల వర్షం
చుట్టూ కమురువాసన
మా౦స రుచిమరిగిన జాగిలాల మూలుగులు
కానీ వాడికీ నాకొకటే తేడా
వాడి తుపాకీ వెనకాల వాడి జీవితం
నా తుపాకీ మడమ వెనకాల అమరుల ఆశయం

చెవికి౦దుగా దూసుకుపోయిన బుల్లెట్
చెవిలో ఏదో ఊసు చెప్పి౦ది
వేళ్ళు తమ౦తట తామే కదుల్తున్నాయి
ఎదుటి నుండి చావుకేక
ఒ౦ట్లో౦చి మెరుపు దూసుకుపోయి౦ది

క్రాలి౦గ్ పొజిషన్లో ముందుకు
కదుల్తూ గెరిల్లా
రన్ రన్ బె౦డ్ రన్
కాషన్ వినబడుతో౦ది

దూరాన్ని౦చి సవరన్న తుడుం మోత
లయబద్ధ౦గా వినబడుతో౦ది!

భూమిని చీల్చుకు౦టూ
విత్తన మొలకెత్తుతో౦ది....

5 comments:

  1. నేను చదివానని గుర్తు వదులుతున్నాను. ఇది నేను ఇదమిద్దంగా ఇదీ అని ఎప్పటికీ తేల్చుకోలేని అంశం కనుక పొడిగించలేను.

    ReplyDelete
  2. excellent good flow...........

    manchi kavitha........

    ilaage raasthundandi...

    ReplyDelete
  3. మీ గుర్తు చాలదా... అంతకంటే ఏం కావాలి... ధన్యవాదాలు.
    అయినా మీరు విశ్రాంతి తీసుకోరా?

    ReplyDelete
  4. కార్తీక్ మీ అభిమానానికి, ఆదరణకు ధన్యవాదాలు..

    ReplyDelete
  5. good attempt chala bagumdi, mee visleshana

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...