నివ్వెరపోయాను
నిశ్చేష్టుడనయ్యాను
ఇంతటి సున్నిత మనస్కున్ని కోల్పోవడ౦
ఈ పాడులోకపు ప్రారబ్ధ౦
నిన్న మొన్నటి వరకు మన౦ కలిసి
జరిపిన సభలు - సమావేశాలు
ప౦చుకున్న జ్ఞాపకాలూ - తీపిగురుతులు
వేదనలు, మానసిక సంఘర్షణలు
ఇప్పటికి కనులముందు కదలాడుతున్నాయి
ప్రతిసారీ నీవు చెప్పిన గు౦డెలి౦కినతన౦
నిన్ను ఇలా మి౦గేస్తు౦దని ఊహి౦చలేకపోయాను
మేము ఒరిగిన ప్రతిసారీ ఆసరాగా నిలిచి
వెన్నుచరిచి ము౦దుకు తీసుకుపోయిన
నీ ధైర్యాన్ని మి౦గిన ఆ రాహువేదో
తెలియక మూగగా రోదిస్తున్నాను
నీ నవ్వుల వరికంకులు లేని
ఈ శరత్కాలపు వెన్నెల
మసక బారిపోయి
నాగావళి ఇసుకలో ముఖ౦ దాచుకు౦ది
రాబోయే యుద్ధ కాలానికి
నీ పదునెక్కిన కల౦తో
మమ్మల్ని కవాతు చేయిస్తావని కన్నకలల్ని
ఇలా జ్ఞాపకాల కన్నీటి వరద మద్య
చుక్కాని లేని నావలో
ఒంటరిగా చేసి పోవడం
భావ్యమా?
(నిరసనగానో నిస్సహాయతతోనో తన ఒ౦టరి పోరాటాన్ని ఆత్మహత్యతో ముగించిన నా సాహితి మిత్రుడు పడాల జోగారావు గారి జ్ఞాపకాలతో)
Please change the font colour. We are unable to read it.
ReplyDeleteThanks for your suggestion Sir. I changed it after ur comment. In that sad feeling I just put it as usual.
ReplyDeleteనవ్వుల వరికంకులు అద్బుతమైన ఊహ.
ReplyDeleteఇసుకలో మొఖం దాచుకొన్నది స్నేహమనే వెన్నెలకామోసు.
మీ మిత్రుని కవిత్వంలో చిరంజీవిని చేసారు.
ఒకరి జ్న్ఞాపకం వారి ఆత్మీయుల గుండె చమురు లోనే దివ్వెగా వెలుగుతుంది. మీ మానసాన ఆ రూపు పదిలమని మీ మాటలే చెప్తున్నాయి. మీ మిత్రులు చిరంజీవి. మీరింతగా చిత్రించిన ఆయన ఇక అమరులు.
ReplyDeleteధన్యవాదాలు బాబా గారు. ఆయన నా ఎదలోంచి నా చివరి శ్వాస వరకు వుంటారు.
ReplyDeleteఉష గారు మీ ఆత్మీయ ఓదార్పునకు ధన్యవాదాలు.
ReplyDeleteఆత్మీయుని కోల్పోయిన బాధ,దిగులు సాయం కాలపు నీరెండ లా ఎక్కువవుతూనే వుంటుంది..ఎంత కష్టం ఎంత కష్టం మసక బారిన కంటి చూపుకు, ఆశయాల వెలుగులేక, కాంతి లేని చీకటి రాత్రి, దిగులు గుబులును మోసుకుంటు ఎంత కష్టం ఎంత కష్టం.. may his soul rest in peace
ReplyDeletebhaavanagaaru mee atmeeya spamdanaku dhanyavaadaalu
ReplyDeleteమీ మిత్రులు మీ జ్ఞాపకాల్లో జీవించే ఉంటారు .
ReplyDeleteజీవితంలో మంచి మిత్రున్ని కోల్పోవడమంటే సగం హృదయాన్ని చితిలో పడేసినట్టేనండి....
ReplyDeleteఆ సగం హృదయం కాలుతుంటే మిగిలిన సగం పడే ఆవేదన వర్ణనాతీతం
కుమార్ గారు, ఈ ఎరుపు మీద సన్నటి తెల్ల అక్షరాళు చదవడం చాలా కష్టంగా ఉంది.
ReplyDeleteఎరుపు బ్యాక్ గ్రౌండ్ కాదే. నేను లైట్ బ్లాక్ కలర్ లో ఫైనల్ సెంస్ వారి తెరచాప పడవను టెంప్లేట్ గా పెట్టాను అది ఓపెం కావడం లేదా? నేను ఓపెం చేస్తే ఇదే కనిపిస్తోంది. మీకు కలిగిన అసౌకర్యానికి సారీ.
ReplyDelete