Tuesday, October 6, 2009
ఏడో చేప చెవిలో గుసగుస...
ఎనిమిదో చేపను నేనే అయి
ఏడో చేప మొప్పలపై ప్రేమగా నిమిరి
తన చెవిలో గుసగుసలాడాను..
చేపా నిన్ను యీ ఒడ్డుకు చేర్చినదేమిటమ్మా అని!
మా మనసులలో దాగిన కల్మషమా!
లేక మేము విడుస్తున్న కాలుష్యమా? అని
నీ గొంతు మూగబోయి
నీ ఒడలు కాంతి విహీనమయి
నీ పై పొరలుగా ఏర్పడ్డ ఈ నల్లని
నూనె చారికలు దేని గురుతులు?
పాల నురుగులాంటి సముద్రుడు
నేడు యిలా ఉగ్రరూపుడై సునామీ అవతారుడై
కన్నెర్ర చేస్తున్న సూచికను తెలిపేందుకా?
నీ ఎర్రని బోసినోరు యిలా నెత్తురోడుతున్నదేమి?
నీ ప్రేయసిని చెరబట్టి అమ్మిన మా పాపాన్ని కడిగేందుకా?
క్షమించు తల్లీ యిక్కడ ప్రేమ, కరుణ, ఆప్యాయతలు
అమ్మకపు సరుకయినాయి...
నాయీ వేడుకోలును దయతో మన్నించుతల్లీ...
రాబోకు యిలా యీ రాచకార్యాల
రణరంగం మద్యకు...
Subscribe to:
Post Comments (Atom)
baagimdamdi,especially last paragraph
ReplyDeleteచాలా బాగుంది, భావం స్పృష్టం గా, సూటి గా మనసుకు హత్తుకునేట్లు వుంది...
ReplyDeleteఊహించలేని భావాలతో చాలా బాగుందండి.
ReplyDeleteసంవేదనలు, ఆక్రోశం సూటిగా తగిలేలా వ్రాయటంలో మీకు మీరే సాటి. ఇంతటి కరుణరసం మేళవించి నా జలపుష్పాభిషేకం కొరకు మీరందించిన ఈ కవితకు కృతజ్ఞతలు.
ReplyDeleteప్రదీప్, భావన, జయ గార్లకు ధన్యవాదాలు. ఉషగారి జలపుష్పాభిషేకానికి అర్హమైనది రాయగలనా అని భయపడ్డాను. మీ స్పందనలతో అది పోయింది. థాంక్స్.
ReplyDeleteక్షమించు తల్లీ యిక్కడ ప్రేమ, కరుణ, ఆప్యాయతలు
ReplyDeleteఅమ్మకపు సరుకయినాయి...
ఒక చేపతో ఇటువంటి మాటలు చెప్పలనిపించిన మీ ఆలోచనా సరళికి కైమొడ్ఫులండి .......
మాకు మాత్రంచాలా స్పస్తంగా అర్థం అయ్యిందండి.....
దన్యవాదాలు...........
కార్తీక్ మీ రాకకు ధన్యవాదాలు, మీ తెలుగు చాలా బాగుంది.
ReplyDeleteమీ చేప కవిత లేక చేప చెప్పిన కథ బాగుంది.
ReplyDeleteThank you నాగరాజు రవీందర్ గారు.
ReplyDelete