వాడికొకటే ధ్యాస
కౄరత్వంలో కొత్త పద్ధతులెలా కనిపెట్టలని
నా తపన వేరు
అత్యాచారాలనెలా అంతమొందించాలని
నరకం అంటే కోపమెందుకు?
ఆకాశాన్ని నిందించడం దేనికి?
లోకమంతా అన్యాయం నిండివుంటే
రా! ఎదుర్కొని పోరాడుదాం!
నేను కొద్ది క్షణాల అతిథిని
పొద్దు పొడుపుని సూచించే వేగుచుక్కని
ఆరిపోవడం అంటే భలే ఇష్టం నాకు
నా చుట్టూ గాలిలో
చైతన్యపు విద్యుత్తు ప్రవహిస్తోంది
పిడికెడు బుగ్గి క్షణికమయినది
ఉంటే ఎంత? లేకుంటే ఎంత?
సుఖంగా వుండు తమ్ముడూ!
సాగిపోతున్నా పయనమై
ధైర్యంగా వుండు… నమస్తే!
నీ సోదరుడు,
భగత్ సింగ్
సెంట్రల్ జైలు, లాహోర్,
(మార్చి3, 1931)
( జైలునుంచి చిన్న తమ్ముడు కులతార్ సింగ్ కి రాసిన ఆఖరి ఉత్తరం)
(సెప్టెంబరు ౨౮న భగత్ సింగ్ జన్మదినం)
(సేకరణ: నా నెత్తురు వృధాకాదు, భగత్ సింగ్ రచనలు - జనసాహితి ప్రచురణలు)
మీరు నమ్మిన విలువలు ఆదర్శాల పట్ల మీరు కనపరిచే గౌరవం నాకు చాలా అపురూపంగా తోస్తుంది, కుమార్ గారు. మీరిలాగే పిడికిలి బిగించినంత గట్టిగా వాటినీ గుర్తుంచుకోవాలని నా ప్రగాఢ ఆకాంక్ష.
ReplyDeleteమీ ఆకాంక్షను నిలబెట్టే ప్రయత్నం నిరంతరమూ చేస్తునే వుంటా. ఈ గౌరవం ఎన్నాళ్ళు నిలుపుకోగలనో? నిలుపుకోలేని నాడు వెబ్ నుంచే కాదు అదే నా చివరి శ్వాశ కావాలని ఎల్లప్పుడూ కోరుకుంటాను మేడం. ఇదంతా ఒక రొమాంటిసిజం గా అనిపిస్తుంది కొందరికి. కాని అది నా way of life గా వుండాలని....
ReplyDeleteజోహార్ భగత్ సింగ్ జోహార్
ReplyDeleteభారత మాత సిసలైన ముద్దు బిడ్డవు నీవు
నీ రక్తాన్ని విప్లవంగా మార్చి ఒక సరికొత్త మార్గానికి నాంది వైనావు
ఎందరో వీరులకు స్ఫూర్తి నిచ్చి అమరజీవి వైనావు.