ఈ విశాల జీవన ఎడారి తోవలో
నీవు వదలిన పాద ముద్రలను వెతుకుతూ
అనంత తీరాల వెంబడి అణ్వేషణ సాగిస్తున్నా!
ఇవి ఒట్టి ఇసుక రేణువులా… కాదు
నీ అడుగు జాడల వెంబడి విరిసిన నక్షత్ర ధూళి!
నన్ను ఈ ఎండమావుల వదిలి నీవు
కానరాని తీరాల వెంట పయణమగుట భావ్యమా?
ఈ ఎడారి మూపున చిగురించిన
సగం కాలిన నెలవంక నీడల వెనక
నీవు వదలిన నీ నీడ జాడలో
నా ఈ వెతుకులాట…
సుదూరంగా
నీ నవ్వుల ఒయాసిస్సు
కనురెప్పల తెరల మాటుగా…..
నిజంగానే నా ప్రక్కన కిటికీలోంచి చూస్తే మీరు వెదుకుతున్న జ్నాపకం వంటిదే నన్నొకటి పలుకరించిపోయిన భావన.
ReplyDeleteఉషా మేడం మొదటిగా వచ్చిన మీ పలుకరింపునకు ధన్యవాదాలు.
ReplyDeletechaalaa baagumdi.nee navvulaa oyasissu kannu reppala tera maatuna...very very good.
ReplyDeletekoncham aksaraala size pedda raayandi.kallaku ibbamdi gaa undi.meeku abyamtaram lekapote..
ReplyDeleteసుభద్ర గారు మీ ఆత్మీయ పలకరింపునకు, సూచనకు ధన్యవాదాలు.
ReplyDeleteఅనంత తీరాల వెంబడి అణ్వేషణ సాగిస్తున్నా!
ReplyDeleteఇవి ఒట్టి ఇసుక రేణువులా… కాదు
-------------------------------------------
సుదూరంగా
నీ నవ్వుల ఒయాసిస్సు
కనురెప్పల తెరల మాటుగా…..
----------------------------------------------
వాహ్ మిత్రమా !! మీకు మీరే సాటి ..
నన్ను నిజంగానే కదిలించింది మీ కవిత . మీ భావ వ్యక్తీకరణ అద్భుతం వర్మ గారు ..
కనులకు దూరమైనా మనసులో నీవున్నవన్న ఊహ మధురం
ReplyDeleteశ్రీను మీ అభినందనకు ధన్యవాదములు.
ReplyDeleteహను గారికి మీ రాక చాలా ఆనందంగా వుంది. మీ మధరమైన ఊహ పంచుకున్నందుకు నెసర్లు.
ReplyDeleteఈ ఎడారి మూపున చిగురించిన
ReplyDeleteసగం కాలిన నెలవంక నీడల వెనక
అద్బుతమైన వ్యక్తీకరణ. extraordinary
అవునూ యానాం రాం మీకెలా తెలుసు. అతను నేను బాల్యమిత్రులం. అతని కొ.అ.కన్నీటి ఉత్తరం చదివారా? బాగుంటుంది. చదవండి. ఈ సారి కలిస్తే అడిగినట్లు చెప్పండి.
బొల్లోజు బాబా
బాబా గారికి మీకు నచ్చిన వాక్యం రాయగలిగినందుకు సంతోషంగా వుంది. రాం గురించి మీకు మైల్ చేసాను.
ReplyDeleteఈ ఎడారి మూపున చిగురించిన
ReplyDeleteసగం కాలిన నెలవంక నీడల వెనక
naaku ee linlu chaalaa bagaa nachchay anDi...
ilage rasthu maakoo margadarsakulu kaavaalani maa chinna vinnapam...
cartheek thanks for your kind comment.
ReplyDeleteమిముల్ని ఎండమావిని చేసుకొని... ఆమె నవ్వుల ఒయాసిస్సు కై మీ వెదుకులాట అద్వితీయం...
ReplyDeleteసగం కాలిన నెలవంక...
ఆమె అడుగు జాడల వెంట పూయించిన నక్షత్రాలు...
చాల బాగున్నాయి...
Thank You Naren for your kind comment.
ReplyDeleteఇక్కడ నేనూహించినది అందరూ అనుకున్నట్లుగా ఆమె కాదు. అమరులైన నా మిత్రులు.