Thursday, July 2, 2009

నింగికెగసిన నేల తార



నిన్ను మరల మరల చూడాలని అనిపిస్తోంది

నిజానికి మనిషి బతికున్నప్పుడు లేని ఆప్యాయత

అనురాగం ఇలా బయటకు తన్నుకువచ్చేట్లు చేసే

ఆ మృత్యు మహారాజుకు వందనం

ఏమిటో నీ పాటలలోని సాహిత్యం ఎన్నడు నాకు

అర్ధం కాకపోయినా ఆ సంగీత ఝరి నా నరాలలో

విద్యుత్ ప్రవహింపచేసేది

నీ కదలికల వేగం నిజమేనా అని అనిపించేవి


విశ్వ వ్యాపితమైన నీ పాట మాధుర్యం

మరువనివ్వకున్నది

నీ జాతి జనుల స్వెచ్చా కాంక్షనీ మోములో

ప్రతిఫలించేది


నాకెందుకోగాని నీ యవ్వనంలోని నల్లనయ్య

రూపమంటేనే ఇష్ట౦
ఏమిటో మల్లీ నీవు వస్తావని మరలా

నీ మునివేళ్ళపై

ఈభూగోళాన్ని గిర గిరా తిప్పుతావని అనిపిస్తోంది
ఐ వాంట్ యు కం బాక్

2 comments:

  1. అదే జరిగితే ఎంత బాగుంటుంది కదా!

    ReplyDelete
  2. మరణంతో అమరులయ్యేవారు పుణ్యచరితులు
    గానంలో ఓలలాడెడివారు ఘనచరితులు
    తిరిగిరాని లోకాలు చేరినవారు చిరంజీవులు
    హృదయప్రాంగణాన నిలుపుకున్నవారు భాగ్యశాలులు

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...