Tuesday, February 25, 2014

కాసిన్ని పూలూ నేత వస్త్రాలు...

 
నువ్వెప్పుడో వదిలి వెళ్ళిన నూనె అంటిన పూలు
పరిమళిస్తున్నాయింకా ఈ దోసిలిలో


జ్ఞాపకాలన్నీ ఒక్కోసారి దారప్పోగులనంటీ అంటని
జిగురులా జారిపోతాయేమో

అయినా అల్లబడని వస్త్రం సారె పైన రంగు పట్టని
నూలుపోగులా

వదిలేయి కాసిన్ని పూలూ నేత వస్త్రాలు
ఒక మూలగా

ఎప్పుడో ఒక ఖాళీ మాటల పోగుల మద్య
పాడబడని పల్లవిలా

ప్రమిద అంచులోని వెలుగు జాడల వెనక
దాగిన నీడలా

దేహమంతా ఒక సలపరమేదో కమ్ముకుని
కాసింత పూలెండిన మట్టినద్దుకోనీ 
ఈ పూట

1 comment:


  1. అనుభూతుల అల్లిక
    అనురాగపు మాలిక
    ఇంతకన్నా ఎవరిక
    రాయగలిగే ఏలిక...

    kudos...
    sir...

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...