Saturday, February 1, 2014

బిహైండ్ ది డోర్స్...

 
ఒక్కోసారి తలుపు తెరవకుండానే వుండాలి

మూసుకున్న తలుపులు కాసింత స్వాంతననిస్తాయి
ఝుమ్మని వీచే సుడిగాలి ధూళి నుండి
రివ్వున దూసుకు వచ్చే రాయీ రప్పానుండి

కాసేపు తలుపు మూసే వుంచుతా

గదినిండా పరచుకున్న పరిమళమేదో
తరలిపోకుండా లోలోపల ఇంకేలా
వెలిగిన ప్రమిదలోని వత్తి ఆరిపోకుండా

కాసేపు తలుపు తెరవను

చూసే కొద్దీ లోలోపల వర్ణరహితమైన
కాంతి పరచుకుంటున్నంతలో
పేజీలన్నీ ఒక్కోటీ తరిగి చివరి అట్టపై
వాక్యాలన్నీ అముద్రితమైనంతలో

తలుపు తెరవను

నీవొక్కరే నాలో ఒక్కో అణువూ
చిద్రం చేస్తూ అనామధేయంగా
మిగిలేంత వరకూ


(రా.11.00, 01-02-2014)

8 comments:

  1. అలా ఎదలోకి గుంజుకుని తలుపేసుకుంటే ఎలాగండి వర్మగారు. :-) good poetry with lovely feel

    ReplyDelete
  2. మీరిలా అంటే ప్రేరణ గారూ ఎక్కడికో తీసుకెల్లిపోయారు..ః-) థాంక్యూ సో మచ్..

    ReplyDelete
  3. Prerana gaaritho nenu ekibavistunnanoch:-):-):-)

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ కార్తీక్ గారూ...

      Delete
  4. మూసిఉన్న తలుపుల వెనుక రహస్యమేదో దాగుంది :-)

    ReplyDelete
    Replies
    1. ఆ రహస్యమేదో మాయా విశ్వంకు తెలియదా..:-) thank you viswamji..

      Delete
  5. " చూసే కొద్దీ లోలోపల వర్ణరహితమైన
    కాంతి పరచుకుంటున్నంతలో
    పేజీలన్నీ ఒక్కోటీ తరిగి చివరి అట్టపై
    వాక్యాలన్నీ అముద్రితమైనంతలో

    తలుపు తెరవను"

    సూపర్ ... రేటింగ్
    చాలా అర్ధ వంతంగా ఉంది మీ కవిత
    అభినందనలు వర్మ గారు ... అందుకోండి మరి

    ReplyDelete
    Replies
    1. మీ అభినందన వ్యాఖ్య స్పూర్తిదాయకం సార్.. ధన్యవాదాలు శ్రీపాద గారు..

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...