Friday, May 3, 2013

ఎండిన...

 
ఎండిన ఆకు ఈనెను అలా గట్టిగా
వత్తి పట్టకు
విరిగి పోతుంది కదా...
ఎండిన మొదలుపై అలా గట్టిగా
వేటు వేయకు
ఒరిగి పోతుంది కదా...

ఎండిన నీటి పాయలో అలా గట్టిగా
అడుగు వేయకు
ఇసుక కోతకు గురవుతుంది కదా...

ఎండిన చర్మం పై అలా గట్టిగా
పట్టి చూడకు
నెత్తురు చిమ్ముతుంది కదా...

ఎండిన ఎదపై అలా గట్టిగా
మాటాడకు
పగిలి ముక్కలవుతుంది కదా...

4 comments:

  1. ఆకు, చెట్టు, ఏరు, చర్మం ఎండినా మరల చిగురించడమో, నిగారించడమో సాధ్యం....కాని ఎదని ఎండనీయకండి శ్వాసే ఆగి జీవఛ్ఛవమౌతుంది!

    ReplyDelete
  2. ఎద దానికదే ఎండిపోదు కదా పద్మార్పిత గారు ..::( శ్వాస ఆగినా జ్ఞాపకాలు పదిలం కదా :-(

    ReplyDelete
  3. నిండిన ఎద ముక్కలయ్యాకే కదా ఎండేది?
    ఎండినా అందులో ఎక్కడో జీవం ఉంటుందని కవితలో చెప్పారు. బాగుంది. నిజమే, ఎండిన ఎద ముక్కలయితే ఇకది నిర్జీవమే!
    ఎద నిండినా, ఎండినా...ఎప్పటికీ సున్నితమే!

    ReplyDelete
    Replies
    1. మీ అత్మీయ స్పందనకు ధన్యవాదాలు చిన్ని ఆశ గారు.. మీ మాటతో నా కవితకు పరిపూర్ణత్వాన్నిచ్చారు. థాంక్యూ వెరీ మచ్..

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...