Tuesday, June 29, 2010
ఖాళీ ఆవరణ
ఇప్పుడిక్కడంతా ఆవరించుకుంటున్న
ఖాళీ గురించే ఆలోచన..
గుండె గదినుండి అంతా పోగొట్టుకున్నట్టు
చివరాఖరి బొట్టు వరకు పీల్చి వేయబడ్డట్టు
ఏదో మాయో మత్తో కమ్ముకున్నట్లుగా
అంతా ఖాళీ అయిన ఆవరణ..
దేనిచేత పూరింపబడని ఒక లెక్క తప్పిదమా?
కాదేమో!
ఎందుకో అంతా జబ్బపట్టి లాక్కుపోతున్నట్టు...
నాకున్న ఈ రెండుపాదాల కింది నేల
వ్రయ్యలయినట్టు!
ఓ గబ్బిలం నా కనులముందు తన
రెక్కలతో విసురుతున్నట్టు!
కోల్పోయిన సందడి ఎవరిస్తారు మిత్రమా?
అడిగే హక్కు నాకున్నా
మొఖం చాటేసి పోతున్న నీ వెంబడి
ఈ నాలుక్కాళ్ళ పరుగులో నిన్ను
చేరలేనితనం...
దహించివేస్తున్న అగ్నకీలల బారినుండి
ఏ ఫైరింజన్ కాపాడగలదు?
పోనీ పోనీ అంటూ నిస్సహాయ
రాగాలాపన చేయలేని మొండితనం
ఎన్నాళ్ళు నిలబెట్టగలదు...
(అసంపూర్ణం)..
Subscribe to:
Post Comments (Atom)
మొదటి సగం చాలా బాగుంది అనుకునే లోపల కొంచెం కన్ఫుస్ అయ్యాను..క్షమించండి..టు బి కంటిన్యుడ్ (అసంపూర్ణం).. అన్నారు కదా.. మొత్తం చదివి అభిప్రాయం చెపుతా..
ReplyDeleteచాలా బాగా వ్రాశారు.. కీపిటప్!..
ReplyDeleteThank you Raj garu
ReplyDelete