Wednesday, December 30, 2009

అంత:సాగరం




ఎందుకో చెప్పలేను..

సముద్రానికెదురుగా వుంటే
తనలోకి అలా నడిచి వెళ్ళి
అంతర్థానమవ్వాలని ఒకటే ఆతృత!

ఏదో నా స్వంత ఆత్మలోకి
ప్రవేశిస్తున్న భావన వెంటాడుతుంది
నన్నెవరో తనలోకి లోలోకి ఆహ్వానిస్తున్న అంతఃప్రేరణ!

నా ఆదిమమూలాలను తట్టిలేపే అవిరామ ఘోష
గుండె గదిమూలలలో..

నా కాళ్ళు అలా అలా తనలోకి లోలోకి...
మరింత దగ్గరితనం!!

నా కనుల ముందు మరే దృశ్యానికి చోటులేనితనం!

నా సంఘర్షణలకు ఒక స్వాంతననిచ్చే ఒక
మహా విశ్వరూపం సముద్రం

తల్లో తండ్రో లేక ఓ విశాల బాహువుల స్నేహితుడో
నన్ను మనసారా ఆలింగనం చేసుకుంటున్న అనుభూతి
వెనక్కిరానివ్వని ప్రియురాలి బిగి కౌగిలా?

నా చివరి ఊపిరి తనలో కలవాలని
ఒకటే తృష్ణ
..........

8 comments:

  1. ఏదో నా స్వంత ఆత్మలోకి
    ప్రవేశిస్తున్న భావన వెంటాడుతుంది
    నన్నెవరో తనలోకి లోలోకి ఆహ్వానిస్తున్న అంతఃప్రేరణ......
    అవును! సముద్రాన్ని చూసిన ప్రతి సారీ ఆ ఘోష ఆహ్వానంలాగే వినిపిస్తుంది. కవ్విస్తుంది.

    సాగర చిత్రణో, మీ అంతరంగ ఆవిష్కరణో గానీ అద్భుతంగా ఉందండీ కవిత! మీ పాత కవితలేమైనా ఉంటే కూడా తీరిగ్గా చదవాలి ఒకరోజు.

    ReplyDelete
  2. సుజాత గారూ ధన్యుడ్ని. నాకు సముద్రాన్ని చూసిన ప్రతిసారీ కలిగే నాలోని అనుభూతిని ఇలా పంచుకున్నా. ముందుగా తన దగ్గరకు వెళ్ళాలంటే ఎప్పుడూ తిరిగిరానివ్వడేమోనని భయం. అలా వదిలి రాబుద్ధి కాదు. ఆ ప్రేరణే ఇలా..

    ReplyDelete
  3. ఒకనాటి జలచరమైన మానవునికి, దాదాపు తన దేహంలో అరవై శాతం నీరున్న మనిషికి ఆ సంద్రపువీక్షణం ఈ పాటి అనుభూతిని మిగల్చదా మరి.

    ReplyDelete
  4. ధన్యవాదాలు ఉషగారూ. మీ వ్యాఖ్యతో మరింత అర్థాన్ని చేకూర్చారు.

    ReplyDelete
  5. వర్మ గారు,

    మీ కవితా చాలా బాగుంది. చివరి పాదాలతో
    నా చివరి ఊపిరి తనలో కలవాలని
    ఒకటే తృష్ణ
    మీ అంతరంగం సుస్పష్టం అవుతోంది.

    ReplyDelete
  6. వర్మ గారూ !
    May your New Year ( 2010 ) be full of Happiness and Sunshine

    SRRao

    sirakadambam

    ReplyDelete
  7. sir adbhuthangaa undi ee kavitaa bhaavana.

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...