Tuesday, December 22, 2009

మునిముని.... మనమడా


శతాబ్ధాలుగా ఈ నేలలో వేళ్ళూనికుని వున్న
నాపై కరకు ఱంపాలతో నిర్దయగా కోస్తూ
నన్ను నా తల్లి గర్భంలోంచి పెకిలించి
నువ్వు పాదుకున్నదేమిటి బిడ్డా?

నీ మునుపటి తరమేదో నీ కన్నులలో మసకబారి పోయిన
మీ తరానికి శాపమౌతున్న నా మరణ వాంగ్మూలమిది బిడ్డా...

కానీ ఈ నేల నాలుగు చెరగులా పరచుకున్న
నా చిగురు కనుల చూపు మేరా
నా జ్నాపకాలు పరుచుకున్నాయి...

చరిత్ర పుటల మధ్య నలిగిన జీవన చిత్రాలను
నా ఎదలోలోపల పొరల్లో దాచుకున్నాను...

ఎన్నెన్నో సంతోషకర ఘటనల
సమాహారం నా బెరడుచుట్టూ పొదువుకున్నాను....

ప్రకృతి మాత పురిటినొప్పులను
నా వేళ్ళ చుట్టూ భరిస్తూ వచ్చాను...

ఎన్నెన్నో రథచక్రాల పదఘట్టనలను
కనుల ఈనెల మాటున కథ చిత్రాలుగా పాదుకున్నాను...

నీ యంత్ర భూతముల కోరలతో నన్ను
పెకలించి నా చావును ఆహ్వానించిన
నీ తరం భవిష్యత్ ఏమిటోనన్నదే నా బెంగ
ముని ముని మనమడా...

13 comments:

  1. బాగుందండి.. నిజం గా చెట్టేదో వచ్చి చేపుతన్నట్లయి ఒక క్షణం గిల్టీ గా అనిపించింది (ఒక క్షణమే లెండి)

    ReplyDelete
  2. ప్చ్ ఏమిటో మనసంతా కెలికేసినట్లైంది. బహుశా ఈ మధ్య గిరి వనాల్లో గడిపిన నాటి అనుభవమా ఇది.. నా వరకు ఏ పచ్చని మొక్కనీ చావనివ్వను. వాతావరణంతో అది నశిస్తే తిరిగి మరో మొలక పాతుతాను. అదొక్కటే తృప్తి.

    ReplyDelete
  3. భావనగారూ ఆ క్షణం చాలు నా వాక్యం మీకు ఆ ఫీల్ ఇచ్చినందుకు థాంక్స్.

    ReplyDelete
  4. ఉష గారూ మీ ఇంటిచుట్టూ ఉన్న పచ్చదనమే చెపుతోంది మీకు ప్రకృతి పచ్చదనం పట్ల వున్న ప్రేమను. ఈ మధ్య గిరులలో తిరిగి వస్తున్నప్పుడు రోడ్ల వెడల్పులో భాగంగా వరుసగా నరికిన వృక్షమహరాజుల మొండేలు చూసి ఇలా స్పందించాను.

    ReplyDelete
  5. wonderful poem. chaalaa baagundi.

    see this too.

    చెట్లు నరికే వాని గొడ్డలి
    తనకు పిడి కావాలని చెట్టునడిగింది.
    చెట్టు ఇచ్చింది. tagore stray birds

    ReplyDelete
  6. బాబాగారికి నచ్చినందుకు ఆనందంగా వుంది.

    ReplyDelete
  7. వర్మ గారూ, మీ కవిత చాలా టచింగ్ గా ఉంది. సాక్షాత్తూ చెట్టే ప్రశ్నిస్తున్నట్లు ఉంది నిజంగా!

    ReplyDelete
  8. varma, very good work. Wonderful job in expressing your feel.
    One small suggestion. In the poem I feel there is lot of scope to make it as a true poem by supressing sentences. I hope you take it as a positive feed back.

    ReplyDelete
  9. సుజాత గారూ మీ స్పందనకు ధన్యవాదాలు...

    ReplyDelete
  10. బా.రా.రె.గారూ ఇన్నాళ్ళకు ఇలా వచ్చినందుకు థాంక్స్. నేను మరల ప్రయత్నిస్తాను. వెంటనే కలిగిన స్పందనను బ్లాగులో రాసే వీలున్నందువలన యిలా.. మీ ఆత్మీయ సూచనకు ధన్యవాదాలు.

    ReplyDelete
  11. manchi kavitha miss ayyaanu . chaalaa bagundi varmaaji

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు ఫాతిమాజీ...మళ్ళీ ఈ కవితను గుర్తు చేస్తూ మీ ఆత్మీయ స్పందన తెలియచేసినందుకు..

      Delete
  12. హ్మ్...మనిషి ఎప్పుడు మేలుకుంటాడో...
    చెట్లను ఎప్పుడు కాపాడుకున్తాడో ....
    చాలా బాగా వ్రాశారు.

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...