Sunday, December 6, 2009

మహానటికి కన్నీటి నీరాజనం



ఆ కళ్ళలోకి సూటిగా చూడగలమా
ఆ ముగ్ధ మనోహర రూపాన్ని
చూడగానే పరిపూర్ణ స్త్రీ రూపం
సాక్షాత్కరిస్తుంది
ఎందుకో అమ్మా నిన్ను చూడగానె
చేతులు కట్టుకోవాలనిపిస్తుంది

వెండితెరపై ఓ మెరుపులా మెరిసి
మాయమయ్యావా?
లేదు ఇప్పటికీ నీ కళారూపాలుకు
సాటిలేదు రాదు కూడా

దేశం కోసం నిలువుదోపిడీ
ఇచ్చిన నీ ఋణం
తీర్చలేనిది

ఓ మహానటీ కావ్య నాయికా
నీకు వేల వేల వందనాలు

7 comments:

  1. నాకూ అభిమానమే. తన జీవిత చరిత్ర చాలా నోళ్ళలో విన్నాను. ఈ మధ్య రమాప్రభ గారు వేరొక అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు కాస్త మార్పుగా విన్నాను.

    ReplyDelete
  2. మల్లా ఎన్నాళ్ళకయినా చూడగలమా నీ లా౦టి నటిని. అయినా మా మదిలో నటి అ౦టే నీ రూపమేగా మెదిలేది

    ReplyDelete
  3. ఆమె నటన మాత్రమే కాదు.. జీవితమూ ఒక పాఠమే...

    ReplyDelete
  4. ఉషగారు ఎవరేమన్న ఆమే ఉత్ఠాన పతనాలు ఒక నటిగా, స్త్రీమూర్తిగా ఆమె మనకిచ్చిన సందేశమే. మీకు చెప్పగలిగేటంతటివాడిని కాను.

    మల్లి మరియు మురళీ గార్లకు ధన్యవాదాలు.

    ReplyDelete
  5. మహానటి నిజంగానే ఆమెకు ఎలాంటి పురస్కారాలు ఇవ్వలేదు. ఆమెకు పద్మవిభుషం ఇవ్వాలి పోస్తుమాస్ ఐనా ఇవ్వచ్చు కదా. మీకు ధన్యవాదాలు చాలా బాగా స్మృత్యంజలి చేసారు.

    ReplyDelete
  6. అవును మహా నటి, గొప్ప వ్యక్తి, జీవిత విఫలాలను ఓడి లో మోస్తూ ఓంటరి గా నిష్క్రమించిన తార. నీరాజనలు అర్పించదగ్గ వ్యక్తి.

    ReplyDelete
  7. రమ మరియు భావన గార్లకు ధన్యవాదాలు.

    అర్హులైన వారికి పురస్కారాలు దక్కకపోవడంతో వాటి విలువను అవి కోల్పోయాయి. ఆమెకు కోట్లాదిమంది మదిలో దక్కిన స్థానం ఏ పురస్కారమూ సాటిరాదు.

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...