Thursday, July 23, 2009

తొలకరి - ఉభాలు


వేసవన్నాల్లు కుత కుత ఉడికిన మట్టి
తొలకరి చినుకులు కురవగానే
వెదజల్లే
పరిమళం
ముక్కు
పుటాలను తాకగానే
నాలోని ఆదిమ తత్వం ఒక్కసారిగా మేల్కొని
నన్ను ఆనంద సాగరంలో ముంచెత్తుతుంది

వానజల్లుతో
పులకరించిన పుడమి తల్లి
ఏరువాక
సాగగానే
ఒడలంతా గుల్లబారి
తనలోకి వంగడపు విత్తనాన్ని
ఆహ్వానించి చిగురువేసే దృశ్యం
ప్రకృతంతా పచ్చని
పున్నమి
వెన్నెలాకాశం!

4 comments:

  1. ఎంత మధురమైన అనుభూతో కదా ఇది. ఆ భూసింధూరం కి సాటైన పరిమళం ఇంతవరకు నేను చవిచూడలేదు. బహుశా నా ఏరువాక పున్నమికి రైతన్నలకి నా వందనం! http://maruvam.blogspot.com/2009/06/blog-post_07.html చూసినట్లు లేరు. పనిలో పని తాజా టపా కూడా ఓ మారు చూసిరండి.

    ReplyDelete
  2. చూసుంటె రాసే ధైర్యం చేయకపోదును. ఎందుకో దారిపొడుగునా ఉత్సాహభరితంగా జరుగుతున్న ఉభాలు (ఇది కళింగాంధ్రలో ఉడుపులను అనే వాడుక పదం) చూసి మనసు పులకించి రాయాలనిపించి రాసాను. మీ అంత బాగాలేదు నా భావ వ్యక్తీకరణ.

    ReplyDelete
  3. ఇదేమి మాట చెప్పండి వర్మ? comparison is the death of happiness ఇవన్నీ మీరు అనుభూతి చెంది ఆ తాదాత్మ్యంలో వ్రాసుకుంటున్నవి. మీ మనసున జనించిన పదాలివి. నాకు చూడగానే మరోకవిత వ్రాయాలనిపించినంత ప్రేరణ. కానీ సమయాభావం, మనసింకా నా ప్రేమ ప్రస్థానంలోనే ఊగిసలాడుతుంటే కాసింత అదుపుచేసుకున్నాను. చక్కగా మరెంతో చిక్కగా వుంది మీ వ్యక్తీకరణ.

    ReplyDelete
  4. Thanks for your kind compliment which will gives me the energy to step forward.

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...