Saturday, March 5, 2016

ఈ రాతిరి....

ఈ రాత్రి
ఒదిగిన కొన్ని ఖాళీల మధ్య
ఒక నిర్లిప్త ఆకాశం పరచుకుంది!

ఆ గది మూల
ఎండిన నీటి కడవపై
సుద్ద ముక్కతో ఏవో గీతలు అలికినట్టుగా!

ఈ గోడకు వేలాడుతున్న
అద్దపు పగుళ్ల మధ్య అతికీ అతకని
సాలీడు గూడు చిట్లిపోతూంది!

ఆ విరిగిన కిటికీ
తలుపుపై పెన్సిల్తో ఓ పేరు
అస్పష్టంగా చెరిగిపోతూ!

ఈ ఐమూల గుంజకు
వేలాడుతున్న చొక్కా జేబులోంచి
గాలికి ఎగిరిన ఓ కాగితపు పూవు!

ఈ రాతిరి
నెత్తుటి ముద్దగా మారిన వెన్నెల
ఆ వంతెన చివర దృశ్యమౌతూ!!

(28th feb. 2016)

3 comments:

  1. ఈ ఐమూల గుంజకు
    వేలాడుతున్న చొక్కా జేబులోంచి
    గాలికి ఎగిరిన ఓ కాగితపు పూవు..
    ఇలా అక్షరాలతో మనసు మూల ఒదిగిపోతారు

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...