అలా ఏ మూల నుండో ఆ కిటికీ చువ్వనానుకొని
ఒక్కో బొట్టుగా జారుతు
తన చిన్ని ముక్కుతో ఓ పిచ్చుక జారుతున్న
నీటి బొట్టును అందుకుంటూ తడిగా మెరుస్తూ
తన కాలి గురుతులు ఒక్కొక్కటి అద్దంపై
అచ్చులుగా మారుతూ ఆవిరవుతూ
గదిలో దేహమంతా జ్వరం వాసన అలముకొని
ఒంటరిగా మూలుగుతూ
గాలికి లయగా కొట్టుకుంటున్న కిటికీ తలుపు
మూతపడుతున్న రెప్పలపై జల్లులుగా
కదలని గడియారం ముళ్ళు గోడపై
నగ్నంగా వేలాడుతూ
ఒక్కోసారి ఇలాగే నిశ్చేతనంగా సమయం
నియంతలా జైలు గదిలో కూలబడుతూ..
Beautiful poetry Varmaji
ReplyDeleteThank you Sir..._/\_
Deleteగాలికి లయగా కొట్టుకుంటున్న కిటికీ తలుపు
ReplyDeleteమూతపడుతున్న రెప్పలపై జల్లులుగా
గదిలో దేహమంతా జ్వరం వాసన అలముకొని
ReplyDeleteఒంటరిగా మూలుగుతూ... excellent varmagaru
Thank you Prerana garu
Deleteఎప్పటిలాగే మంచి భావకవితతో అలరించారు.
ReplyDeleteThank you Telugammaayi garu
Delete