Thursday, May 14, 2015

వెదురు పూలు..


రాత్రికి ఈ గోడ నిండా ఓ నినాదమై
కంపించాలని వేళ్ళనిండా రంగు పూసుకొని

అతను ఆమె రహస్యంగా నడుస్తూ
ఇంత వెలుతురుని వెదజల్లుతూ

అక్కడక్కడా ఏరిన తురాయి పూలను
అగ్ని పింఛంలా ధరిస్తూ ఆమె

గాయమైన స్వప్న శకలాలకు వెదురు పూల 
రెక్కలు అతుకుతూ అతను

దూరంగా ఆకాశ పాదాన ధింసా ఆడుతూ 
సూరీడు సందురూడు!!

11 comments:

  1. అతను ఆమె రహస్యంగా నడుస్తూ
    ఇంత వెలుతురుని వెదజల్లుతూ like

    ReplyDelete
  2. ఎంతందంగా వ్రాసారండి. ప్రతి అక్షరం బాగుంది

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు రాధా మాధవీయం గారు.. _/\_

      Delete
  3. మీ కవితాసంపుటికలో మరో మణిపూస వర్మగారు.

    ReplyDelete
    Replies
    1. మీ ఈ మాట చాలు పద్మార్పిత గారూ. ధన్యవాదాలు

      Delete
  4. మీ కవితల్లో వైవిధ్యం ఎప్పుడూ నాకు నచ్చుతుంది

    ReplyDelete
    Replies
    1. ఇలా మీరంటే చాలదా.. ః-) ధన్యవాదాలు

      Delete
  5. శీర్షికతోనే ఆకట్టుకోవడం మీ స్టైల్

    ReplyDelete
  6. దూరంగా ఆకాశ పాదాన ధింసా ఆడుతూ
    సూరీడు సందురూడు!!EXCELLENT

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...