ఇక్కడో చిత్రకారుడు అక్షరాలకు
నెత్తుటి తడిని అద్దుతూ
దేహాన్ని చిత్రిక పడుతున్నాడు
కనులకంటిన చెమ్మను కోల్పోతూ
రాతి రెప్పలను చెక్కుతూ
నరాలను పేనుతున్నాడు
రాలిన కలలను పేరుస్తూ
వాన నీటిలో రెక్కలూడిన
తూనీగకు రంగులద్దుతున్నాడు
ఇన్ని రాలి పడిన పసిపాపల
కనురెప్పలను ఏరుతూ
నిచ్చెన కడుతున్నాడు
తెగిన దారం చివర గాలిపటాన్ని
ఎగరవేస్తూ పావురం
గాయానికి లేపనమవుతున్నాడు..
రాలిన కలలను పేరుస్తూ
ReplyDeleteవాన నీటిలో రెక్కలూడిన
తూనీగకు రంగులద్దుతున్నాడు
బహుశా నాలాంటి వాడే...
Extraordinary Feel in these lines.
Thank you Padmarpita garu.. :-)
Deleteరాతిరెప్పలు అంటే ఎంతో కఠినం అనుకున్నాను ఇంత సున్నితమా!
ReplyDeleteసార్ మీ సైడ్ బార్ చిత్రం టర్న్ ఇచ్చుకుని మమ్మల్ని చూడ్డం ఎప్పుడో, మీరు హాస్య కవితలు వ్రాయడం ఎప్పుడో :-) హాస్యానికి అన్నాను. మంచి కవితను అందిచారు.
ReplyDelete