కలలు రాని కంటి తెరపై
నువ్వో నీళ్ళ రంగు చిత్రాన్ని ఆవిష్కరిస్తావు
కరిగిపోతున్న కాలం తెరచాపపై
చినుగును అతుకుతూ
రాలుతున్న ఆకుల ఈనెలపై
ఒక్కో అక్షరం నెత్తురోడుతూ
ఈ చెరువు అలల మధ్య
తెగిపడిన దేహంతో జ్వలిస్తూ
నిర్వికల్ప సంగీతాన్ని మౌనంగా
ఆలపిస్తూ
............
లోతట్టు భావం
ReplyDeleteరాలుతున్న ఆకుల ఈనెలపై
ReplyDeleteఒక్కో అక్షరం నెత్తురోడుతూ ..భారమైన భావం
Thank you Radha madhaveeyam garu, Palapittagaru..
ReplyDelete