నీ చుట్టూ ఇన్ని కాగితప్పూలు
ఎరుపు పసుపు నీలం వర్ణాలలో
కమిలిన నీ అరచెతులలో
రాలిన పూరెక్కలు ఓదార్పుగా
సరే నువ్వంటావు ఈ నిదుర పట్టని కనులకు
కలల మోహం వీడదే అని
ఈ గోడపై అలికిన ముగ్గు రంగు వెలిసి పోతూ
గూటిలోని దీపం మసిబారి సూరీడి కంట కన్నీరొలుకుతూ
రాత్రి నీ పొత్తికడుపులో బలంగా వాడు తన్నిన బాధ మెలిక పెడుతూ
నేలపై మొకాళ్ళ మధ్య లుంగలు చుట్టుకు పోయిన దేహం
గుండెలో వాడి బూతులు సూదుళ్ళా గుచ్చుతూ
నోటిలో ఉప్పగా నెత్తుటి ఊటై
గాట్లు పడ్డ రొమ్ముపై ఒరిగిన లేత పెదాల కోసం
లేని శక్తిని కూడగట్టుకొని
మరల ఈ దినం ద్వారబంధం ముందు నువ్వొక నెత్తుటి పూవులా
అంతా రుధిరమేనా
ReplyDeleteఅంతే కదా రాధాజీ.. నెత్తురోడే బతుకులు
Delete