ఎప్పుడో ఒక్కసారైనా అలా ఓ గాలి కెరటం విసురుగా తాకి
ముసురుకున్న కారు మబ్బులను తొలగిస్తాయా
కాసేపలా ఈ క్రీనీడల మాటున మరిచిపోయిన ఊసులేవో
పోగు చేసుకుని పొత్తిళ్ళలో దాచుకుందాం
వద్దులే మరల మరల ఇవే మాటలు
నీకూ నాకూ విసుగు తెప్పిస్తాయి
ఇలా ఖాళీగానే అపరిచిత వాక్యాలుగా
మిగిలి వెంటాడి వేధించనీయ్
ఇదేదో అలవాటుగా మారి
గాయంపై బొబ్బలా ఉబికి చిట్లి సలపరమెట్టనీయ్
. . . . . . . . .
a good varma.నిర్మొహమాటాంగానే ఈ మాట.
ReplyDeleteధన్యవాదాలు రాజారాం సార్ _/।\_
Deleteఅపరిచిత వాక్యం ఎంతబాగుందో.
ReplyDeleteధన్యవాదాలు సంధ్య శ్రీ గారు..
Delete