Friday, May 2, 2014

అనావృతం...



ఎప్పుడూ నువ్వేసే ప్రశ్న వెంటాడుతూనె వుంటుంది
గాయాల సలపరమేనా కవిత్వం
నీ వూహల్లోనైనా నే లేనా?
నాకోసం ఇన్ని పూలూ యింత గంధం అద్దిన
ఒక్క మాటైనా రాయలేవా? 
అని...

నిజమే కదా
పూరెమ్మలకంటిన నెత్తురు
గంధం పరిమళాన్నివ్వలేదు కదా!

పగిలిన ముఖం అద్దంలో చూపలేక 
దాగిన వెన్నెల!

ఆకాశం అంచు నేలను తాకిన చోట
చేతి వేళ్ళ కొసలనుండి
జాలువారే సెలయేటి నీళ్ళ స్పర్శను
నీవందుకోలేవింక!

దూరంగా నెట్టి పోయిన స్నేహం 
గుండెకింత రంపపు కోతనే మిగిల్చిన క్షణం
రెక్క తెగిన పావురంలా యిలా!

6 comments:

  1. Replies
    1. అద్భుతం..ఏం చెప్పను. ఏమీ చెప్పను.

      Delete
  2. వర్మగారూ .. చాలా నచ్చింది నాకు మీ ఈ కవిత .
    భావాలు ఎంతో బాగా ఏమిడాయి.
    కొంచెం భారంగా కూడా అనిపించింది.
    అభినందనలు.
    శ్రీపాద

    ReplyDelete
  3. sir...mee vennela daari podavuna vinapadutunna aaswaramu, geyamuu... yevarivi?

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...