Saturday, March 22, 2014

కలల తూనీగ..

రాతిరంతా రెప్పలపై కలల తూనీగ
తెలవారగానే రెక్కలు విరిగి నేల రాలింది


రంగు వెలసిన గోడపై నీ చేతి గోళ్ళ గీతలే
నెత్తుటి మరకల మద్య వేలాడుతూ

తూటా దిగిన గుండె గొంతులో పాట
చివరి మూలుగుగా మారింది

గాయపడ్డ పక్షి రెక్క తెగి పడి
శపిస్తోంది మూతపడ్డ రెప్పలమద్య!!

9 comments:

  1. రాసినవి నాలుగు మాటలే అయినా ...
    చాలా భావయుక్తంగా ఉంది మీ కవిత

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. dhanyavaadaalu sir.. meerila protsahiste raayakunda undagalanaa..:-) thank u sir..

    ReplyDelete
  4. కలల తూనీగ రెక్కలు విరిగిపడితే.....అలా వదిలేస్తారా !!!!? వర్మగారు :-)

    ReplyDelete
    Replies
    1. తూనీగే నేనైనపుడు ఇంకెలా పద్మాజీ.. ః-(

      Delete
  5. Simply super varma gaaru:-):-)

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ కార్తీక్ గారూ..

      Delete
  6. వర్మ గారూ బాగుందండీ మీ కవిత

    "రంగు వెలసిన గోడపై నీ చేతి గోళ్ళ గీతలే
    నెత్తుటి మరకల మద్య వేలాడుతూ "

    ముఖ్యంగా మీ పై మాటలు చాలా నచ్చాయి
    ఇలాగే కొనసాగనీ ... మీ చేతి కలం ప్రయాణాన్ని .
    ***శ్రీపాద

    ReplyDelete
  7. బాగారాశారు ఎప్పటిలా

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...