Saturday, December 31, 2011

వీడ్కోలు..



2011

వీడ్కోలు నీకు

నా జీవితంలో ఇంత విషాదాన్ని
మిగిల్చిన నీకు వీడ్కోలు...

నన్ను నాన్ననుండి దూరం చేసిన
నీకు కన్నీటి వీడ్కోలు...

నీవు వహించిన తలారి పాత్రకు
నిన్ను నిందించలేను
అలా అని మౌనంగా వుండిపోలేను...

పోరాట పతాకమైన వారిని
పొట్టనపెట్టుకు పోతున్న నీకు
సంతాప వీడ్కోలు...

జ్నాపకాల దొంతరలలో
ఇంత విషాదపు చీకటిని
మిగిల్చిన నీకు
తుది

వీ
డ్కో
లు...

1 comment:

  1. పోరాటపు పయనంలో తలారి పాత్ర వహించిన నీకు మాత్రమ్ తల తెగకుందా
    మా వారిని మానుంచి సాగనంపిన నీకు మాత్రం శాశ్వత స్థానముందా?
    కానీ చరిత్రలో నీ మరకల మకిలి మాత్రం పదిలం....
    నీ పై మా నింద మాత్రం అనివార్యం....అందుకే అందుకో మా తుది వందనం

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...