Monday, December 12, 2011

నాన్నంటే..

నాన్నంటే నాకు కవచ కుండలాలతో పుట్టిన కర్ణుడిలా అనిపిస్తాడు...
నాన్నంటే నాకు మేరు పర్వతం చూసినట్టుంటుంది....
నాన్నంటే పొద్దు పొడుపులోని సూరీడు గుర్తుకొస్తాడు...
నాన్నంటే గల గల పారే సెలయేటి సవ్వడి వినిపిస్తుంది...
నాన్నంటే సరిహద్దున కాపలా వున్న సాయుధుడు గుర్తుకొస్తాడు...

నిండుకుండను చూసినప్పుడలా నాన్న యాదికొస్తాడు...
పండిన బంగరు రంగు వరి కంకులను చూసినప్పుడల్లా నాన్న మదిలోకొస్తాడు...
ధారగా కురుస్తున్న వానలో తడిచినప్పుడల్లా నాన్న గుండెల్లో పొదివి పట్టుకొన్నట్టుంటుంది...
చలిగాలి రివ్వున వీచినప్పుడంతా నాన్న కుంపటిలో రాజేసిన నిప్పులా వెచ్చగా హత్తుకున్నట్టుంది...

నాన్నా నువ్వు గుర్తుకు రాని క్షణమేదైనా వుంటే నా ఊపిరాగిన తరువాతే....






2 comments:

  1. "నాన్నా నువ్వు గుర్తుకు రాని క్షణమేదైనా వుంటే నా ఊపిరాగిన తరువాతే...." హృద్యమైన రచన..అభినందనలు తమ్ముడూ !

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...