ఎదురెదురుగా రెండు బండరాళ్ళు!
ఆమె..
నేనూ...
ముందుగా ఎవరు కదిలిస్తారోనని
ఒకరికొకరు ఎదురు చూపు...
కరిగిపోవడానికి సిద్ధమై
కూచున్న రాళ్ళు...
కదిపేది ఎవరు?
కదిలించేది ఎవరు??
కాలం మంచుగడ్డై
ఉషోదయం కోసం ఆత్రంగా...
ఇన్ని బలహీన క్షణాలు
కరిగిపోతూ చుట్టూ
పొడిబారిన ఆవరణం...
కదలని దేహాలు
కరగని ఆత్మలు
చుట్టూ వలయాలుగా
పరిభ్రమిస్తూ
విసుక్కుంటూ!
బ్రద్దలవుతుందేమోనన్న
సందేహం వదలని
భేతాళునిలా భుజంపై
వేలాడుతూ
మౌనంగా శపిస్తూ...
ఆ అసంకల్పిత
ప్రతీకార చర్యను
ప్రేరేపించేది
ఎ
వ
రు?
ఎప్పటికి???
very nice.
ReplyDelete@వనజ వనమాలి gaaru dhanyavaadaalandi..
ReplyDeleteహ్మ్మ్..
ReplyDeleteబాగుందండీ కవిత! :)
కవిత బాగుందండి...! సింపుల్ గా...!
ReplyDeleteA good poem varma gaaru.!
ReplyDeleteNice one andii..
ReplyDeleteజీవితం అవకాశమిస్తుందో లేదో ఒకోసారి ఎవరూ కదపలేరు కొన్ని జీవితాలాలు అనురాగాలూ అలాగే జ్నాపకాలుగా శాశ్వతంగా మిగిలిపొతాయేమో....కవిత బాగుంది భావం బధగా ఉంది ....ప్రేమతో ...జగతి
ReplyDeleteకవిత బాగుంది వర్మగారు...
ReplyDeleteఆ డ్రై నెస్ కవితంతా పర్చుకుని పాఠకుని వరకూ వొచ్చింది వర్మా....మీ ప్రయత్నం విజయవంతమె..అందులో మమ్మల్ని భాగస్వాముల్స్ని చేసినందుకు ధన్యవాదాలు
ReplyDeleteనెట్ ప్రోబ్లం వలన మిత్రుల స్పందనలను చూడలేకపోయాను. అందరికీ ధన్యవాదాలు...
ReplyDelete