Monday, November 21, 2011

ఖాళీ అయిన కుర్చీ..


ఖాళీ అయిన కుర్చీ..
నేను పాకుతున్న వయసులో
ఆ కుర్చీ చేతులు పట్టుకొనే నిలవడం నేర్చుకున్నా...

ఎప్పుడు చూసినా ఎంతో ఠీవిగా
చిరునవ్వులు చిందిస్తూ వున్నట్టుండేది...

అటువైపు చూసినప్పుడంతా మరచిపోయిన
హోంవర్కు గుర్తొచ్చి కాళ్ళు వణికేవి...

ఒప్పచెప్పాల్సిన పాఠాలు గుర్తొచ్చి
అమ్మ కొంగు వెనక చేరిపోయేవాణ్ణి
అప్పుడు చూసి నవ్వుతూ లాలనగా
తన ఒడిలో కూచోపెట్టుకొని అక్షరం
విలువ చెవిలో ఉపదేశిస్తూ నుదుటిపై ముద్దుపెట్టేది.....


తన చుట్టూ వనమూలికల సువాసనలతో
పరిమళిస్తూ రోగులకు స్వాంతననిచ్చే
ధన్వంతరీలా ఎప్పుడూ ఆయుష్షునందిస్తుండేది...

కాలం కరిగిపోతున్నా ఆ చేతులు అలా
ఎంతోమంది మనసులను చక్కదిద్ది
ఆనందంతో నింపి కరుణతో స్వాంతననిచ్చేది....

౩.

నన్ను దగ్గరకు తీసుకుని అప్యాయంగా
నా నుదుటిపై ప్రేమగా తాకే ఆ చేతులు
కానరాక హృదయమంతా శూన్యమావరించింది...!!

6 comments:

  1. వర్మగారూ...చదివిన మనసుకు భావ సంచలనం కరువైంది. ధన్యవాదములు.

    ReplyDelete
  2. హృదయమంతా శూన్యమావరించింది...!!

    ReplyDelete
  3. వర్మగారూ,
    నిజమే! సాంత్వననిచ్చే చేతులుకోల్పోడం ఒక విషాదం. కాని అది మనం తప్పించుకోలేని ప్రకృతిధర్మం. We have to submit and reconcile to Nature's law.

    ReplyDelete
  4. @జ్యోతిర్మయి అక్కా థాంక్స్...

    @subha గారు ధన్యవాదాలు...

    @sunamu గారు మీ ఆత్మీయ స్పర్శకు ధన్యవాదాలు...

    ReplyDelete
  5. ఇంత ఆలస్యంగా చూసానేంటా అని మనోవేదనకు గురైనది ఇది చదువుతుంటే:-(

    ReplyDelete
    Replies
    1. మీ ఆత్మీయతకు ధన్యవాదాలు పద్మగారూ..

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...