Saturday, April 9, 2011

నేను ప్రకృతిని



వెన్నెల చల్లదనాన్ని
సూరీడి వెచ్చదనాన్ని
పదిలంగా దాచుకున్నవాణ్ణీ!

అడవి పరిమళాన్ని
ఊపిరినిండా శ్వాశించినవాణ్ణి!

సంద్రపు అలల సవ్వడిని
వలలో బంధించిన వాణ్ణి!

గలగల పారే సెలయేళ్ళ
సంగీత ఝరిని
ఆలాపన చేసిన వాణ్ణి!

తొలకరి పులకరింతలో
మట్టి వాసన నిండుగా
పూసుకున్న వాణ్ణి!

ఆమనితో పాటు
శిశిరాన్ని ఎరిగినవాణ్ణి!

వడిసెల రాయిని
గురిచూసి విసిరిన వాణ్ణి!

లోపలితనాన్ని
గుండెలో భద్రంగా
దాచుకున్న వాణ్ణీ!

నేను ప్రకృతిని....

3 comments:

  1. చాలా చాలా బాగుంది.

    కానీ చివరి వాక్యంతో అర్థమో మరింకేదో మరి మొత్తం మారిపోయినట్టుంది... అనిపించింది.

    గీతిక

    ReplyDelete
  2. మట్టిమనిషి
    .........................
    ప్రకౄతిలోని అందాలను
    పంచబూతాలలోనిప్రేమను
    హౄదయపు కవాటాలలో
    నింపుకుని
    స్వచ్చమైన మనస్సులాంటి
    జలపాతం హొరుని
    అంతులేని సముద్రపు
    అలల లయను
    నక్షత్రాల మెరుపును
    భానుడి వేడిని
    చంద్రుడి చల్లదనాన్ని నీలో
    నింపుకుని
    రుతువులకే గతులు
    నేర్పుతూ
    కాలాలకే పాఠాలు
    చెప్పిన నీవు
    నేడు గ్లోబలైజేషన్లో
    ప్రకౄతి విద్వంసమై
    పంచబూతాలు కలుషితమై
    సౄష్టి స్తితి లయకారుడవైన
    నీవు నేడు కాందశిఖుడిలాగా
    వల్లకాడులో పడివున్నావా?

    ReplyDelete
  3. @గీతిక గారూ థాంక్సండీ...

    @గాజుల గారూ మీ కవితా స్పందన బాగుంది..

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...