నవ్వొస్తోంది...
స్వేచ్చగా వీచేగాలిని పిడికిట పట్టేనీ మూర్ఖత్వం చూస్తేనవ్వు వస్తోంది...వెన్నెల చల్లదనాన్నిగదిలో బంధించ జూచేనీ అహంకారాన్ని చూస్తేనవ్వు వస్తోంది...ఉదయించే సూర్యున్నిఅడ్డంగా నిలబడిఆపేద్దామన్ననీ ఆరాటం చూస్తేనవ్వు వస్తోంది...గల గల పారే సెలయేళ్ళనుసీసాలో పట్టేస్తానన్ననీ ప్రయాస చూస్తేనవ్వు వస్తోంది...
చాలా బాగా రాసారు!...
ReplyDeleteసహజత్వం లో వుండే పరిమళాన్ని ఆఘ్రాణించినట్టున్నారు! అభినందనలు!!
("కోటలో రాణి కొండవీటి రాజా " ప్రోగ్రాం వాళ్ళాకి పంపండి బుధ్ధొస్తుంది.)
@సత్యః సార్ మీ అభినందనలకు ధన్యవాదాలు.. కొండవీటి రాజా కోటలో రాణి ప్రోగ్రాంను నిషేధించమని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.. కానీ వారి గొంతుకు తోడయ్యేవారు కరువయ్యారు...
ReplyDeleteపోయెం చాలా బావుంది.
ReplyDeleteఈ కోటాలో రాణీ ప్రోగ్రాం ఏమిటి? టీవీ పోటీ కార్యక్రమమా??
నాలుగ్గోడల నడుమ నీలుగుతున్న నవ నాగరికుని జీవితాన్ని బాగా ఎత్తిపొడిచారు. ప్రకృతిని గోడ మీద పెయింటింగ్స్ లో ఆరాధించేవారు నవ్వటమూ మరిచే ఉంటారు. మీరు పెట్టిన బొమ్మలో నవ్వులు గాలికి ఊగే బంతిపూల రెక్కలనీ, ఆకుల మీద గెంతే సీతాకోకచిలుక రంగులనీ జ్ఞాపకానికి తెస్తున్నాయి.
ReplyDelete@కొత్తపాళీః సార్ అది జీతెలుగులో వస్తున్న టీవీ ప్రోగ్రాం సార్.. కవిత నచ్చినచ్చి కామెంటుంచినందుకు ధన్యవాదాలు సార్..
ReplyDelete@ఉషగారూ చాన్నాళ్ళ తరువాత మీ వ్యాఖ్య పొందడం ఆనందంగా వుంది.. ధన్యవాదాలు...
ReplyDelete